Published On:

Akhil Akkineni: కాబోయే భార్యతో అయ్యగారు.. భలే క్యూట్ గా ఉన్నారే

Akhil Akkineni: కాబోయే భార్యతో అయ్యగారు.. భలే క్యూట్ గా ఉన్నారే

Akhil Akkineni: అక్కినేని చిన్న వారసుడు అఖిల్.. ప్రస్తుతం లెనిన్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం అఖిల్ కనిపించాడు. ఇప్పటివరకు క్లాస్ లుక్ లో కనిపించిన అయ్యగారు.. ఈసారి హిట్ కోసం మాస్ లుక్ లోకి మారిపోయాడు. ఏజెంట్ తరువాత అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే లెనిన్ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

 

ఇక ఇదంతా పక్కన పెడితే.. అయ్యగారు మాత్రం.. తనకు కాబోయే భార్యతో ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇద్దరు వెకేషన్ కి వెళ్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఎయిర్ పోర్టులో సందడి చేశారు. చైతన్య పెళ్లికి రెండు రోజుల ముందే నాగార్జున.. తన చిన్న కొడుకు అఖిల్ వివాహం.. జైనబ్ తో జరుగుతుందని అధికారికంగా ప్రకటించాడు.

 

సడెన్ గా అయ్యగారి పెళ్లి అని తెలియడంతో అభిమానులు షాక్ అయినా.. జంట చూడముచ్చటగా ఉండడంతో.. త్వరగా పెళ్లి చేసుకోవాలని ముచ్చటపడుతున్నారు. ఇక అధికారికంగా పెళ్లి ప్రకటన వచ్చాక.. అయ్యగారు.. జైనబ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇక ఎయిర్ పోర్టులో ఈ జంట ఎంతో క్యూట్ గా కనిపించారు. గ్రీన్ అండ్ గ్రీన్ డ్రెస్ లో అఖిల్.. ఫ్లోరల్ కోట్ తో జైనబ్ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని నడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

అయితే మొన్న అంటే అఖిల్ తన పుట్టినరోజును జరుపుకోవడానికి జైనబ్ తో కలిసి వెళ్ళాడు. ఈసారి ఎక్కడకు వెళ్తున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక లెనిన్ షూటింగ్ విషయానికొస్తే.. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవడం వలన కొద్దిగా ఆలస్యం అవుతుందని టాక్. మరి అయ్యగారు ఈ సినిమాతోనైనా గాడిన పడతాడా.. ? లేక ఇది కూడా కొండెక్కుతుందా.. ? అనేది చూడాలి.