Good Bad Ugly OTT: నెల రోజుల్లోపే ఓటీటీకి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ..!

Good Bad Ugly OTT Release and Streaming Details: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఓ వైపు రేసింగ్‌లో యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన విదాముయార్చి విడుదలైన నెల గ్యాప్‌లోనే గుడ్ బ్యాడ్ అగ్లీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ అందుకుంది.
ఈ సినిమా అజిత్ నటన, యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మెల్లిమెల్లిగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన 5 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. జస్ట్ రెండు నెలల గ్యాప్‌లోనే అజిత్ రెండు బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక థియేటర్లల్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అయిన ఈ సినిమా నెల రోజుల్లోనే ఓటీటీకి రాబోతోందట. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ని ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఒప్పందం ప్రకారం ఈ సినిమా మే 8న స్ట్రీమింగ్ ఇచ్చేందుకు సదరు సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో అజిత్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో మెప్పించారు. త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, ప్రియా ప్రకాశ్ వారియర్, ప్రభు, కార్తికేయ దేవ్, రఘు రామ్ వంటి తదితర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది.
ఇవి కూడా చదవండి:
- Yamadonga Re Release Trailer: తారక్ బర్త్‌డే ట్రీట్, మరోసారి థియేటర్లకు ‘యమదొంగ’ – రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?