Nara Lokesh: భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ: మంత్రి లోకేష్

Nara Lokesh: ఏపీ మంత్రి లోకేష్ మహిళల్ని ఉద్దేశిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ అని వర్ణించారు. విద్యార్థి దశ నుండే మహిళల్ని గౌరవించేలా సమాజంలో మార్పు తీసుకురావాలని తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు మాత్రం ప్రతినిత్యం మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం తనను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు.
ఎన్ని సార్లు మహిళలను అవమానించకండి అని చెప్పినా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతల అహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళల్ని గౌరవించడంతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరిగేలా చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు వైసీపీ నాయకులు కూడా చదవాలని కోరుతున్నట్లు మంత్రి లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
#YCPinsultsWomen
భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసేది మహిళ! విద్యార్థి దశ నుండే మహిళల్ని గౌరవించేలా ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి సమాజంలో మార్పు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. వైసీపీ నాయకులు మాత్రం ప్రతినిత్యం మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం నన్ను తీవ్ర ఆవేదనకు… pic.twitter.com/Obyw81M0tH— Lokesh Nara (@naralokesh) June 27, 2025