Last Updated:

GATE 2023 Notification: 2023 గేట్ నోటిఫికేషన్ విడుదల

దేశ వ్యాప్తంగా పీజీ, డాక్టరేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్-2023 GATE-2023 నోటిఫికేషన్ నేడు విడుదల చేసారు. ఈ ఏడాది గేట్ ను ఐఐటీ కాన్పూర్ వారు నిర్వహించనున్నారు. గేట్ రిజిస్ట్రేషన్లలను ఈ నెల 30 వ తారీఖున ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేశారు.

GATE 2023 Notification: 2023 గేట్ నోటిఫికేషన్ విడుదల

New Delhi: దేశ వ్యాప్తంగా పీజీ, డాక్టరేట్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే గేట్-2023 GATE-2023 నోటిఫికేషన్ నేడు విడుదల చేసారు. ఈ ఏడాది గేట్ ను ఐఐటీ కాన్పూర్ వారు నిర్వహించనున్నారు. గేట్ రిజిస్ట్రేషన్లలను ఈ నెల 30 వ తారీఖున ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేశారు. గేట్ కు దరఖాస్తు చేసుకునే వారు సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ ను 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో తెలుయజేశారు. ఫలితాలను మార్చి 16, 2023న విడుదల చేయనున్నట్లు ఐఐటీ కాన్పూర్ వారు తెలిపారు.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు: ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పాస్ ఐనా వారు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు.

పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మూడుగంటల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 29 సబ్జెక్టుల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది. 1 లేదా 2 పేపర్లగా ఈ పరీక్ష ఉంటుంది. అది పరీక్ష రాసే అభ్యర్థులు ఎంచుకోవచ్చు. నెగటీవ్ మార్కింగ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ఫీజు: అభ్యర్థులు రూ.1700 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు రూ.850 చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్షకు అప్లై చేసుకునే తేదీ : ఆగస్టు 80, 2022. ఆఖరి తేదీ: సెప్టెంబర్ 30, 2022 వరకు మాత్రమే లేట్ ఫీజు వారికి లాస్ట్ డేట్ కూడా ఉంటుంది. అక్టోబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 4, 5, 11, 12. పరీక్ష తేదీలు: మార్చి 16. అధికారిక వెబ్ సైట్ లాగ్ ఇన్ అవ్వండి : https://gate.iitk.ac.in/

ఇవి కూడా చదవండి: