GDS Results: జీడీఎస్ 2023 ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి
GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది.
GDS Results: దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ నియామకాలు-2023కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. జనవరిలో భారత తపాలా శాఖ 40,889 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
https://cept.gov.in/
ఏపీ, తెలంగాణ ఫలితాలు.. (GDS Results)
దేశవ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల్లో 40,889 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అన్ని సర్కిళ్ల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి మొదటి జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్ధులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకూ ఒకే మార్కులు ఉండి ఉద్యోగానికి ఎంపికైతే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు మార్చి 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి.
ధ్రువపత్రాల పరిశీలనకు గడువు మార్చి 21
ఎంపికైన అభ్యర్థులు మార్చి 21 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే నియామక ఉత్తర్వులు అందుతాయి. ఇక రోజుకు నాలుగు గంటలు విధులు మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్‌ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది.