Last Updated:

EPFO Jobs: ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే?

EPFO Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. న్యూ దిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

EPFO Jobs: ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు.. చివరి తేదీ ఎప్పుడంటే?

EPFO Jobs: పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. న్యూ దిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా.. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివరాలు ఇవే.. (EPFO Jobs)

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (గ్రూప్ సి): 2674 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 ఖాళీలు ఉన్నాయి.

కేటగిరీ వారీగా ఖాళీలను ప్రకటించారు. ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 514, ఈడబ్ల్యూఎస్‌లకు 529, అన్‌ రిజర్వ్‌డ్‌కు 999 కేటాయించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా.. నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్ లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు.. దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఉద్యోగాలకు ఎంపికైన వారికి జీతభత్యాలను ఈ విధంగా కేటాయిస్తారు. నెలకు రూ. 29,200 – రూ.92,300 గా పేర్కొన్నారు.

ఈ పోస్టులకు అభ్యర్ధులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం

ఈ పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలకు గాను 600 మార్కులను కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది. జనరల్‌ ఆప్టిట్యూడ్‌(30 ప్రశ్నలు), జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌(50 ప్రశ్నలు), కంప్యూటర్‌ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. రూ. 700 గా నిర్ణయించారు. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తు/ రిజిస్ట్రేషన్ తేదీలు: 27-03-2023 నుంచి 26-04-2023 వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 27-04-2023 నుంచి 28-04-2023 వరకు.