Published On:

Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

Free training for unemployed youth: తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శ్రీసత్యసాయి సేవా సంస్థ శుభవార్త చెప్పింది. నిరుద్యోగుల కోసం డేటా ఇంజినీర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ యువతకు విలువైన కెరీర్ అవకాశాలను అందించేందుకు రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థ, శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద ఉచిత డేటా ఇంజినీర్ కోర్సును ప్రారంభిస్తోంది. బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీటెక్, ఎంటెక్, లేదా ఎంసీఏలో డిగ్రీలు అర్హత కలిగి ఉన్న 2021-2024 పాస్- అవుట్ గ్రాడ్యుయేట్లందరికీ ఉంటుందని తెలిపింది. వివరాల కోసం www.sethu.aiలో నమోదు చేసుకోవాలని, లేదా 9052372023కు కాల్ చేయాలని సూచించింది.