Last Updated:

Mumbai: బయటపడ్డ భారీ సెక్స్ రాకెట్ .. ప్రముఖ నటి అరెస్ట్

Mumbai: బయటపడ్డ భారీ సెక్స్ రాకెట్ .. ప్రముఖ నటి అరెస్ట్

Mumbai: ముంబైలో భారీ సెక్స్‌ రాకెట్‌ బయటపడింది. మోడల్స్ తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ నటితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ ముంబైలోని గోరెగావ్ లోని ఓ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హోటల్ పై పోలీసులు దాడులు చేపట్టారు.

 

మోడల్స్ ను ట్రాప్ చేసి(Mumbai)

ఈ దాడుల్లో భోజ్ పురి నటి సుమన్ కుమారిని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారు. వర్థమాన మోడల్స్ ను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దించుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో ముగ్గురు మోడల్స్ ను పోలీసులు రక్షించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ హైటెక్ వ్యభిచారంతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

పక్కా ప్లాన్ తో దాడులు(Mumbai)

కాగా, 24 ఏళ్ల భోజ్ పురి నటి గోరేగావ్ లోని రాయల్ పామ్ హెటల్ లో ఈ వ్యాపారాన్ని నడుపుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నటి చీకటి దందా బయటపడింది. సదరు నటి భోజ్ పురి చిత్ర సీమకు చెందిన సమన్ కుమారి గా గుర్తించారు. ఈమె ‘లైలా మజ్నూ’ అనే సినిమాలో నటించింది. అలాగె వెబ్ సిరీస్ జామ్ స్టిక్ బాక్స్, భోజ్ పురి కామెడి ఎపిసోడ్ ‘బాపి నంబ్రి బేటా దస్ నంబ్రి’ లో నటించింది. పలు పంజాబీ, హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా పనిచేసింది.