Last Updated:

కేరళ: అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ… ముగ్గురిపై కత్తితో దాడి

కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‭బాల్‭ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

కేరళ: అర్జెంటీనా, ఫ్రాన్స్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ… ముగ్గురిపై కత్తితో దాడి

Kerala: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ ప్రియులకు ఫిఫా ప్రపంచ ఒక పండుగ లాంటిది అని చెప్పాలి. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా, ఫ్రాన్స్ పై విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఆ పోరులో పెనాల్టీ షూటౌట్ లో అర్జెంటీనా ఆధిక్యం సాధించి టైటిల్ ని కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్జెంటీనా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా మరోవైపు ఫ్రాన్స్ అభిమానులు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయారు.

మన దేశంలో కూడా ఫుట్‌బాల్ కు అభిమానుల సంఖ్య మాత్రం తారాస్థాయిలోనే ఉంది. ఇండియాలో ఫుట్ బాల్ ఆడే వారికి ప్రోత్సాహం లేకున్నా… క్రీడకి మాత్రం ఆదరణ మంచిగానే ఉంది. మన దేశంలో ముఖ్యంగా కేరళలో ఫుట్ బాల్ ప్రేమికులు ఆటపై తమ ప్రేమాభిమానాలను విభిన్న రీతిల్లో ప్రకంటించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్‭బాల్‭ మేనియాను చూసి అందరూ షాక్ అయ్యేలా చేశాయి. అయితే కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది.

ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత కేరళలో ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గోడవలో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్టుల అభిమానులు ఘర్షణ పడినట్లు తెలుస్తుంది. తమ అభిమాన జట్టు గెలిచిందనే ఆనందంలో కొందరు, తమ అభిమాన జట్టు ఓడిందనే నైరాశ్యంలో కొందరు ఉండగా మాటలతో మొదలైన వారి గొడవ, చివరకు ముగ్గురు వ్యక్తులపై కత్తులతో దాడి చేసే వరకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాగా ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఫ్రాన్స్ అభిమానుల్ని అర్జెంటీనా అభిమానులే ముందుగా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, అనంతరం ఇరు వర్గాల వారు బాహాబాహీకి దిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: