Published On:

Subham OTT Release: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న సమంత ‘శుభం’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Subham OTT Release: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న సమంత ‘శుభం’ – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Samantha Subham Movie Locks OTT Release Date: స్టార్‌ హీరోయిన్‌ సమంత నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘శుభం’. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రమిది. హారర్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ 9న థియేటర్లలోకి విడుదలై మంచి విజయం సాధించింది. సినిమా బండి ఫేం ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హర్షిత్‌ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్‌ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్‌ వంటి కొత్త నటులు ముఖ్యపాత్రలు పోషించారు.

 

థియేటర్లలో అలరించి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమౌతోంది. తాజాగా శుభం ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని లాక్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీయోహాట్‌స్టార్‌లో శుభం ఓటీటీ రైట్స్‌ తీసుకుంది. మూవీ థియేట్రికల్‌ రన్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల సెకండ్‌ వీక్‌లో డిజిటల్‌ ప్రిమియర్‌కు రానుందని తాజాగా ఆ సంస్థ ప్రకటన ఇచ్చింది. జూన్‌ 13 నుంచి శుభం జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది.

 

శుభం కథ విషయానికి వస్తే..

భీమునిపట్నం గ్రామం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. అప్పుడప్పుడే ఊర్లోకి డీటీహెచ్‌ కేబుల్‌ కనెక్షన్‌ వస్తుంది. భీమునిపట్నంకు చెందిన శ్రీను (హర్షిత్‌ మల్గిరెడ్డి) కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ను నడుపుతూ తన స్నేహితులు (గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి)తో సరదాగా ఉంటుంటాడు. అప్పుడే అతడికి పోటీగా డిష్‌ కుమార్‌ (వంశీధర్‌ గౌడ్) వచ్చి అందరికి డీటీహెచ్‌లను అలావటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో ఉండగానే బ్యాంక్‌లో పనిచేఏ శ్రీవల్లితో (శ్రియ కొంతం) శ్రీను పెళ్లి జరుగుతుంది.

 

భార్య శ్రీవల్లి టీవీ సీరియల్‌ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు అతడి ఇద్దరు స్నేహితుల భార్య పరిస్థితి అలాగే ఉంటుంది. రాత్రి 9 అవ్వగానే టీవీ సీరియల్‌ చూస్తూ వారి భార్యలు వింత ప్రవర్తిస్తుంటారు. ఒక్క వారి భార్యలు మాత్రమే కాదు ఆ గ్రామంలో మహిళలంత రాత్రి 9 అయ్యిందంటే టీవీలో వచ్చూ జన్మజన్మల బంధం సీరియల్‌ చూస్తూ వింతగా మారుతుంటారు. దీంతో వారిక ఏమైంది? ఆ గ్రామంలో ఆడవాళ్లంత అలా ప్రవర్తించడానికి కారణమేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి: