Elon Musk: సింక్ తో సింబాలిక్ గా ట్విట్టర్ ఆఫీస్ కు ఎంట్రీ ఇచ్చిన మస్క్.. వీడియో వైరల్
ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు.
Elon Musk: ట్విట్టర్ కొనుగోలుకు ఎట్టకేలకు మస్క్ మొగ్గు కనపరుస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఇంత వరకూ బాగానే ఉన్న ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్తూ తన చేతిలో సింక్ పట్టుకుని వెళ్లారు. సింబాలిక్ గా తాను ట్విట్టర్ తో సింక్ అవుతున్నానంటూ సింక్ పట్టుకుని వెళ్లారు. దానికి సంబంధించిన వీడియోను కూడా మస్క్ నెట్టింట షేర్ చేశారు.
ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక ట్విట్టర్ తనతో సింక్ కావాల్సిందే అని మస్క్ తన వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా గతంలోనే ట్విట్టర్ ను 44 బిలియన్ల డాలర్లకు మస్క్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ డీల్‌ను కుదుర్చుకునేందుకు ఆయన ట్విట్టర్ ఆఫీసుకు వెళ్లారు. అయితే ఇదివరకు ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానని మస్క్ ప్రటించారు. కానీ ఆ తర్వాత ట్విట్టర్లో 90శాతం ఫేక్ అకౌంట్లు అంటూ ట్విట్టర్ మోసాలకు పాల్పడుతుందంటూ ఆరోపిస్తూ ఆ డీల్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పారు. దానితో కొంతకాలంగా ట్విట్టర్, మస్క్ మధ్య మాటల యుద్ధం నడించింది. ఇదిలా ఉంటే డీల్ నుంచి బయటపడేందుకు మస్క్ తమపై ఆరోపణలు చేసినట్లు ట్విట్టర్ పేర్కొన్నది.
కాగా మస్క్ ఇటీవల మరల యూ టర్న్ తీసుకున్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒరిజినల్ ప్రైజ్‌కే ట్విట్టర్‌తో డీల్‌ను కొనసాగించనున్నట్లు మస్క్ పేర్కొన్నారు. దానితో మస్క్ మరియు ట్విట్టర్ కి మధ్య జరుగుతున్న కోర్టు కేసు విచారణ ఈనెల 28వ తేదీ వరకు వాయిదా వేశారు. ఒకవేళ రేపటి లోగా ట్విట్టర్, మస్క్ మధ్య ఒప్పందం కుదరకపోతే మరల ఈ కేసులో విచారణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే మస్క్ సింక్ పట్టుకుని వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ఇదీ చదవండి: మ్యూచువల్ ఫండ్ పై చిన్నారి ఆర్ధిక అవగాహన.. పేటీఎం సీఈవో ఫిదా