Inguva Benefits: ఇంగువతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే వదలరు..!
Health Benefits of Inguva: ప్రతీ భారతీయ వంటిట్లో ఇంగువ తెలిసిన పదార్థమే. అసలు ఇంగువ వేయనిదే రోజు గడవని ఇండ్లు లేవంటే నమ్మలేం. అలాంటి ఇంగువకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ముఖ్యంగా అజీర్తి సమస్యలను పరిష్కరించడంతో పాటు జీర్ణక్రియ బలపడటానికి తోడ్పాటును అందిస్తుంది. పోషకాలతో నిండిన ఇంగువ అనేక ఆరోత్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆహర రుచిని పెంచడంతో పాటు అనేక రోగాలను నయం చేయడంలో ముందుంది. దీన్ని ఫెరులా జాతి మొక్క నుంచి గ్రహిస్తారు. ఫెరులా మొక్కల కాండం వేర్ల నుంచి స్రవించిన జిగురును ఎండబెట్టండం ద్వారా అది చిన్న చిన్న రాళ్లలా ఏర్పడుతుంది.దాన్నే మనం ఇంగువ అని అంటాం. దీన్ని పొడిచేసుకుని వంటింట్లో వాడుకుంటారు.

Asafoetida Health Benefits in telugu prime9
ఇంగువకు కడుపుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే గుణం ఉంది. ఇంగువ వాడకంతో ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో వాపును తగ్గిస్తుంది. దగ్గు, జలుబు, శ్వాసకోశ వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. అమ్మమ్మల కాలం నుంచి ఇంగువ అతి ప్రీతికరమైనదిగా వాడుకలో ఉంది. ఇంగువను ఆయా భాషల్లో హింగు, ఇంగువ, హింగార్, కాయం, యాంగ్, హంగు, అగుడగందు అనేక పేర్లతో పిలుస్తారు. ఇంగువకు అనేక ఔషధ గుణాలున్నాయని అయుర్వేదంలో చెప్పబడింది.
అజీర్ణ సమస్యలకు పరిష్కారం..
అజీర్ణం, కడుపునొప్పి, వికారం, పంటి నొప్పి, జలుబు, దగ్గు, జలుబు వల్ల కలిగే తలనొప్పికి ఉపశమనం కలుగుతుంది. అకస్మాత్తుగా కడుపు నొప్పి వస్తే కొద్దిగా ఇంగువను నీటిలో కరిగించి కాస్త గొరువెచ్చగా వేడి చేసి కడుపుపై గుండ్రంగా రాయడం వలన కడుపు నొప్పి ఉపశమనం కలుగుతుంది. బొడ్డు చుట్టూ గుండ్రంగా రాయాలి.

Asafoetida powder Health Benefits in telugu
పంటినొప్పికి ఉపశమనం..
పంటినొప్పి ఉన్నప్పుడు కర్పూరంతో కలిపి నొప్పి ఉన్న ప్రాంతంలో పూయడం వలన ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పి ఉన్నప్పుడు నువ్వుల నూనెలో ఇంగువను మామూలుగా వేడిచేసి చల్లారాక ఆ నూనె చుక్కలను చెవిలో వేయడం వలన నొప్పి తగ్గిస్తుంది. కాముర్లు వచ్చినప్పుడు ఇంగువను అంజీరా పండ్లను కలిపి తినాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజు తినే ఆహారపదార్థాలలో ఇంగువను జోడించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
రక్తాన్ని పలుచబరుస్తుంది..
ఇంగువకు రక్తాన్ని పలుచబరిచి గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ ను, రక్తపోటును తగ్గిస్తుంది. మజ్జిగ లేదా ఆహారంతో కలిపి తినడం వలన కడుపులో గ్యాస్, కలరా, కడుపునొప్పి తగ్గిస్తుంది. మహిళలకు ప్రసవం తర్వాత ఇంగువను తీసుకోవడం వలన గర్భాశయం శుద్ది అవుతుంది.
ఎక్కువగా ఇంగువను తీసుకోకూడదు..
ఆయుర్వేదానికి సంబంధించినవన్నీ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఆయుర్వేదంలో వాడేవన్నీ వేడికారకాలు. ఎక్కువగా తీసుకోవడం, చాలా సార్లు తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ అయినా ఎక్కువగా వాడకూడదు. అలాగే ఆయుర్వేదంలోని ఇంగువ, సొంటి లాంటివి కూడా మోతాదులోనే వాడుకోవాలి.
గమనిక: పైన తెలియజేసిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇంగువను తీసుకునే ముందు ఆయుర్వేద డాక్టర్లను, లేదా అల్లోపతి డాక్టర్లను సంప్రదించడం తప్పనిసరి.