Vizag: ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయి.. 24 గంటలు పోరాడిన యువతి మృతి
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
Vizag: విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా వైద్యులు శశికళకు అత్యవసర చికిత్స అందించారు. ఆమెను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. చివరకు అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఆమె బుధవారం గుంటూరు నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో దువ్వాడ చేరుకుంది. ట్రైన్ దిగుతున్నసమయంలో హడావిడిగా దిగుతూ కాలుజారి రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. దానితో ఆ యువతి భయంతో కేకలు వేయడంతో అందరూ షాక్ తిన్నారు. వెంటనే అక్కడి చేరుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన రైలు ఆపేసి రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. గంటపాటు నరకయాతన అనుభవంచి ఆమెను అష్టకష్టాలు పడి ప్లాట్ ఫామ్ ను కాస్త తొలగించి బయటకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆమె నడుముకి గాయం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ శశికళ కాసేపటి క్రితం కన్నుమూసింది. ఈ వార్త విన్న శశికళ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: సీన్ రివర్స్ … కేపీహెచ్బీ కాలనీలో యువకుడిపై దాడి చేసిన యువతి !