Traffic Restrictions: రేపు సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?
భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
Traffic Restrictions: భాగ్యనగరంలో రేపు అనగా సెప్టెంబర్ 25 ఆదివారం నాడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ ఉన్న నేఫథ్యంలో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీసు అధికారులు వెల్లడించారు. సుమారు వెయ్యి మంది సైక్లిస్టులు కేబుల్ బ్రిడ్జిపై హాజరవుతారని సైక్లింగ్ సంఘం నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐటీసీ కోహినూర్, ఐకియా, రోటరీ, కేబుల్ బ్రిడ్జి, ఎన్‌సీబీ జంక్షన్, గచ్చిబౌలి రోడ్డు నంబర్-45, దుర్గంచెరువు, జూబ్లీహిల్స్ ఇనార్బిట్ మాల్, సీవోడీ జంక్షన్ ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఉదయం 8 గంటల తర్వాత సాధరణ రాకపోకలు కొనసాగుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్రికెట్ లవర్స్ కోసం సెప్టెంబర్ 25న అదనపు రైళ్లు