Royal Enfield Flying Flea: ఇది కదా అసలుసిసలైన ఎలక్ట్రిక్ బైక్ అంటే.. రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఈవీ.. లుక్ అదరహో అదరహా..!

Royal Enfield Flying Flea: రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఫ్లయింగ్ ఫ్లీని పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2024 మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించారు. రాయల్ ఎన్ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6కి ప్రత్యేకమైన రెట్రో-రోడ్‌స్టర్ డిజైన్ ఇచ్చారు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం ఫ్లయింగ్ ఫ్లీ మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందింది. మోటార్‌సైకిల్‌కు ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో రౌండ్ ఎల్ఈడీ ఇండికేటర్ ఉంది.
ఆధునిక బైక్‌లతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏమిటంటే దాని గిర్డర్ ఫోర్క్, టాపర్డ్ టియర్‌డ్రాప్ ఆకారపు “ట్యాంక్”, స్కూప్డ్ సింగిల్-పీస్ సీటు. దీని వెనుక సీటును రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లాగా అమర్చుకోవచ్చు. దీనిలో బ్యాటరీ ప్యాక్ ట్యాంక్ క్రింద ఇచ్చారు. దీనికి కూలింగ్ ఫిన్ కూడా ఉంది. వెనుక వైపున బ్రేస్డ్ రియర్ ఫెండర్, ఫెండర్-మౌంటెడ్ టెయిల్ లైట్, ఇండికేటర్‌లతో గొప్ప రూపాన్ని అందించింది.
రాయల్ ఎన్ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 250-300cc ICE బైక్‌కు సమానమైన పనితీరును అందించే అవకాశం ఉంది. దాని సస్పెన్షన్ యూనిట్‌లో గిర్డర్ ఫోర్క్, మోనోషాక్ చూడవచ్చు. బైక్‌కు ఇరువైపులా డిస్క్ బ్రేక్‌లు, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. దీని వెనుక చక్రం చైన్ డ్రైవ్ ద్వారా రన్ అవుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 మాదిరిగానే రౌండ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఇది వేగం, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఛార్జ్ స్థితి, రేంజ్, మరిన్ని వంటి సమాచారాన్ని అందిస్తుంది. దీని కన్సోల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్లయింగ్ ఫ్లీలో కీలెస్ ఇగ్నిషన్, ట్యాంక్‌పై ఉన్న ఎమర్జెన్సీ సేఫ్టీ స్విచ్ కూడా ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లీ సి6 ఇండియన్ మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.5 లక్షల వరకు ఉండవచ్చు. ఇది తమిళనాడులోని వల్లం వడగల్‌లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో ప్రత్యక్ష పోటీ ఏదీ ఉండదు, కానీ దాని లాంచ్ తర్వాత ఇది ఓలా రోడ్‌స్టర్ ప్రో, అల్ట్రావయోలెట్ ఎఫ్77తో పోటీ పడే అవకాశం ఉంది.