Published On:

JSW MG Windsor EV Craze: ఎందుకంత క్రేజ్.. MG Windsor EV.. అమ్మకాల్లోనూ తగ్గేదేలా లేదు..!

JSW MG Windsor EV Craze: ఎందుకంత క్రేజ్.. MG Windsor EV.. అమ్మకాల్లోనూ తగ్గేదేలా లేదు..!

JSW MG Windsor EV Craze: బ్రిటిష్ ఆటోమొబైల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ సంస్థ భారత మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది. ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ జోరు పెంచుతోంది. ఇదే క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక సరికొత్త కార్లను విడుదల చేస్తుంది. కంపెనీ భారత మార్కెట్లో వివిధ విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. ఎంజీ విండ్సర్ ఈవీని ఎలక్ట్రిక్ విభాగంలో అందిస్తుంది. ఈ క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికల్ (CUV) విడుదలైనప్పటి నుండి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ కారును భారతీయులు అంతగా ఇష్టపడటానికి ప్రధాన కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

JSW MG Windsor EV Sales
భారతదేశంలో ఎంజీ మోటార్స్ ద్వారా ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్ యుటిలిటి వెహికల్‌గా విక్రయిస్తుంది. ఈ కారు విడుదలైనప్పటి నుండి భారతీయుల ఎంపికగా మారింది. దేశవ్యాప్తంగా ప్రతి నెలా ఈ కారు వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తయారీదారు అందించిన సమాచారం ప్రకారం, ఈ కారు విడుదలైన ఆరు నెలల్లోనే 20,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.

 

JSW MG Windsor EV Features
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ఈవీ తయారీదారు అందించే అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, LED DRL, 17, 18 అంగుళాల టైర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, గ్లాస్ యాంటెన్నా, క్రోమ్ ఫినిష్ విండో బెల్ట్‌లైన్, నైట్ బ్లాక్ ఇంటీరియర్‌తో గోల్డెన్ టచ్ హైలైట్‌లు, లెదర్ ప్యాక్‌తో డ్యాష్‌బోర్డ్, డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, డోర్ ట్రిమ్, స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

 

యాంబియంట్ లైట్లు, వెనుక ఏసీ వెంట్స్, PM 2.5 ఫిల్టర్, 10.1 అంగుళాల టచ్ డిస్‌ప్లే, 7, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB ఛార్జర్ పోర్ట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, రెండు స్పీకర్ ఎంపికలు 6, 9 ఉన్నాయి. ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఏరో లాంజ్ సీట్లు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్, స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

 

JSW MG Windsor EV Battery And Range
ఎంజీ విండ్సర్ ఈవీలో కంపెనీ 38 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీని అందించింది. ఇది 0-100 శాతం ఛార్జ్ కావడానికి 13.8 గంటలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 55 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. విండ్సర్ ఈవీలో పర్మినెంట్ సింక్రోనస్ మోటారు అందించారు.ఈ మోటారు 136 పిఎస్ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా దీనిని ARAI ప్రకారం 332 కిమీ వరకు నడపవచ్చు.

 

JSW MG Windsor EV Price
ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ నుంచి మొదలై, దాని టాప్ వేరియంట్ ధర రూ. 15.99 లక్షలు గా ఉంది. దీనితో పాటు, ఈ కారులో బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కూడా అందించారు. దీనితో ఈ కారును కేవలం రూ. 9.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత, ప్రతి నెలా, కిలోమీటరుకు రూ. 3.9 చొప్పున చేయాల్సి ఉంటుంది.