Gold And Silver Prices: బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట.. మే 15వ తేదీ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఇలా
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold And Silver Prices: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనే ఆలోచన చెయ్యాలంటేనే అమ్మో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 56,800 ఉండగా, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 61,950 ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,350 వద్ద నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం పుత్తడి ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,800 వద్ద ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,850 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,800 వద్ద కొనసాగుతోంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 61,800 ఉంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే(Gold And Silver Prices)..
చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,500, ముంబైలో కిలో సిల్వర్ రూ. 74,800, ఢిల్లీలో రూ.77,600, బెంగళూరులో రూ. 78,500, హైదరాబాద్లో రూ. 78,500, విజయవాడలో రూ. 78,700 విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.