Last Updated:

CBI special Task force: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సీబీఐ

పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనసాగుతున్న విచారణలో మరో ఏడుగురు అధికారులను చేర్చారు మరియు విచారణలో చేరడానికి అధికారులను కోల్‌కతా బ్యూరోకు పంపారు.

CBI special Task force: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు.. ప్రత్యేక  టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన సీబీఐ

CBI special Task force: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనసాగుతున్న విచారణలో మరో ఏడుగురు అధికారులను చేర్చారు మరియు విచారణలో చేరడానికి అధికారులను కోల్‌కతా బ్యూరోకు పంపారు.అధికారులందరూ కోల్‌కతాలోని అవినీతి నిరోధక బ్యూరో DIG, CBIకి రిపోర్ట్ చేస్తారు. ఢిల్లీ, విశాఖపట్నం, భువనేశ్వర్, ధన్‌బాద్ మరియు భోపాల్‌ల నుండి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారులను చేర్చుకున్నారు.

ఎస్టీఎఫ్ బృందంలో ఏడుగురు అధికారులు..(CBI special Task force)

ఎస్టీఎఫ్ బృందంలో ఒక ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాలో ఏడుగురు అధికారులు ఉంటారు. వీరిని మే 30 వరకు కోల్‌కతాలోని అవినీతి నిరోధక శాఖకు అటాచ్ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై దర్యాప్తును వేగవంతం చేయడానికి కలకత్తా హైకోర్టు విచారణ పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

2014 మరియు 2021 మధ్య పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమీషన్ (SSC) మరియు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ (గ్రూప్ C మరియు D) మరియు టీచింగ్ స్టాఫ్ నియామకంపై దర్యాప్తు చేయాలని సీబీఐని గత ఏడాది మేలో ఆదేశించడం జరిగింది. ఎంపిక పరీక్షల్లో ఫెయిలయ్యాక ఉద్యోగాలు ఇప్పించేందుకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.

రూ.100 కోట్లకు పైగా వసూళ్లు..

సీబీఐ ప్రకారం, 2014 మరియు 2021 మధ్య పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని నియమించడానికి ఉద్యోగ ఆశావహుల నుండి టిఎంసి నాయకులు రూ. 100 కోట్లకు పైగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.గత సంవత్సరం, రాష్ట్ర మాజీ విద్యా మంత్రి పార్థ ఛటర్జీ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్‌లో అరెస్టయ్యాడు. దీనితోమమతా బెనర్జీ ప్రభుత్వం పై ప్రతిపక్షాల నుండి దాడి తీవ్రమయింది.