Home / West Bengal
పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే మరియు ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదం అవసరం లేదని, పార్టీ మైనారిటీ విభాగాన్ని తొలగించాలని అన్నారు.
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందగా..60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి కారణం గూడ్స్ రైలు కంచన్జుంగ ఎక్స్ప్రెస్ను వెనుక నుంచి ఢీ కొట్టడమని పోలీసులు వివరించారు.
లోక్ సభ ఎన్నికల ఆరవ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 58 లోకసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బుధవారం పశ్చిమ బెంగాల్లో తిరిగి ప్రవేశిస్తున్న సమయంలో కొందరు దుండగులు దాడి చేశారు. రాహుల్ గాంధీ బెంగాల్లోకి ప్రవేశించినప్పుడు, అతని కారుపై ఇటుకలు విసరడంతో అతని వాహనం బాగా దెబ్బతింది.వాహనం వెనుక అద్దం ధ్వంసమైనా రాహుల్ గాంధీకి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటన మాల్దాలో చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. కోట్ల విలువైన రేషన్ కుంభకోణంలో మంత్రి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేశారు.
పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాస్లోని దత్తపుకూర్లోని బాణసంచా కర్మాగారంలో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడులో ఆరుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ స్టేట్ యూనివర్శిటీకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీల్గంజ్లోని మోష్పోల్ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల సమయంలో పేలుడు సంభవించింది.
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రను చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ శనివారం ఆరోపించింది. మే 4 మణిపూర్ వీడియోపై ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ వచ్చింది.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అయ్యింది. రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది.
పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.