Last Updated:

Vastu Tips : వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో నాటితే మంచిది? ఏ దిక్కులో నాటకూడదో తెలుసా??

హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలు ఉంటాయి. వీటిని నిష్టగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది.

Vastu Tips : వాస్తు ప్రకారం తులసి మొక్కను ఏ దిక్కులో నాటితే మంచిది? ఏ దిక్కులో నాటకూడదో తెలుసా??

Vastu Tips : హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలు ఉంటాయి. వీటిని నిష్టగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. తులసి బెరడుతో చేసిన పూసల దండను తులసి మాలగా భక్తిగా ధరిస్తారు. రుద్రాక్ష తర్వాత అంతటి పవిత్రత, ప్రత్యేకత ఈ తులసి మాలకు కూడా ఉంటుంది. హిందూ సంప్రదాయంలో తులసికి ఉన్న స్థానం చాలా విశిష్టమైంది. హిందువుల్లో ప్రతి ఒక్కరూ తులసిని ఆరాధిస్తారు. తులసి మొక్క లేని ఇల్లు దాదాపుగా ఉండదనే చెప్పొచ్చు. అయితే తులసి మొక్క గురించి వాస్తు ఏం వివరిస్తుంది? అది మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అంత పవిత్రమైన మొక్క ఇంట్లో ఏ దిక్కున ఉండాలో మీకోసం ప్రత్యేకంగా..

వాస్తు శాస్త్రం గృహ, భవన నిర్మాణం గురించి మాత్రమే కాకుండా ఇంట్లోని ప్రతి వస్తువు అమరికను కూడా వివరిస్తుంది. అదే విధంగా మొక్కల అమరికను గురించి తెలుపుతుంది. ఇంట్లో ఏ మొక్క ఎటు వైపు ఉంటే మంచిదో వాస్తు నియమానుసారం చెయ్యడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో తులసి మొక్కను నాటే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..

ఏ దిక్కులో నాటితే మంచిది? ఏ దిక్కులో నాటకూడదదు ?? (Vastu Tips).. 

వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీని వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్య(తూర్పు దిశ) దిక్కులను ఎంచుకోవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.

అలానే తులసి మొక్కను దక్షిణ దిశలో ఎప్పటికీ నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తారు. పొరపాటున ఆ దిక్కులో తులసిని నాటితే మీకు భారీ నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో కూడా కలహాలు పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం, తులసి మొక్కను నాటేందుకు కార్తీక మాసాన్ని ఉత్తమ సమయంగా చెబుతారు పండితులు. ఈ నేపథ్యంలో ఈ నెలలో అద్భుతమైన సమయం వచ్చింది కాబట్టి తులసి మొక్కను తూర్పు లేదా ఈశాన్య, ఉత్తర దిశలో నాటండి. కార్తీక మాసంలో కూడా గురువారం రోజున తులసి మొక్కను నాటడానికి సరైన రోజుగా పరిగణిస్తారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/