Ilayaraja Donation to army: పెద్ద మనసు చాటుకున్న ఇళయరాజా.. రక్షణ నిధికి విరాళం!

Ilayaraja Donates one day Salary to Indian Defence: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాలు పరసర్పం డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసుకున్నాయి. అయితే దాడుల్లో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు పాకిస్తాన్ దాడులను భారత్ అత్యాధునిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంది. కాగా భారత్ చేస్తున్న దాడులను తట్టుకోలేని పాకిస్తాన్ కాల్పుల విరమణకు వచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. అయితే దేశంలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.
అయితే దేశరక్షణలో భాగంగా సైన్యానికి, రక్షణ వ్యవస్థకు అండగా ఉంటామని పలువురు ముందుకు వస్తున్నారు. రక్షణ నిధికి తమకు తోచినంతగా సాయం అందిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ఎంపీగా తన ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు, అభిమానులు ఆయనను అభినందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు రక్షణ నిధికి విరాళాలు అందించారు.