Last Updated:

Vladimir Putin: లగ్జరీ ఎస్టేట్ లో.. లవర్ తో పుతిన్ రహస్య నివాసం..

దాదాపు రూ. 999 కోట్లు విలువ చేసే ఈ ఎస్టేట్ ను రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి నిర్మించినట్టు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.

Vladimir Putin: లగ్జరీ ఎస్టేట్ లో.. లవర్ తో పుతిన్ రహస్య నివాసం..

Vladimir Putin: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ గురించి ఏ వార్త అయినా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పుతిన్ కు గురించి కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. తన గర్ల్ ఫ్రెండ్ అలీనా కబయేవాతో కలిసి మాస్కో సమీపంలోని ఓ లగ్జరీ విల్లాలో రహస్యంగా నివసిస్తున్నట్టు ఓ వార్తా కథనం వెల్లడించింది.

దాదాపు రూ. 999 కోట్లు విలువ చేసే ఈ ఎస్టేట్ ను రష్యా బడ్జెట్ నిధుల నుంచి అక్రమంగా డబ్బులు తరలించి నిర్మించినట్టు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.

ఈ ఎస్టేట్ లో అనేక బిల్డింగ్స్ ఉన్నాయని, వారి ముగ్గురు పిల్లల కోసం ఓ ప్లే గ్రౌండ్ కూడా ఉందని ఉందని వార్తా కధనం తెలిపింది.

 

రిలేషన్​లో అలినా, పుతిన్ (Vladimir Putin)

ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, జిమ్నాస్ట్​ అయినా అలినా కబేవా(39)తో పుతిన్​ రిలేషన్​లో ఉన్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారికి ముగ్గురు పిల్లలు అని కూడా టాక్ వినిపిస్తోంది.

ఇక ఇప్పుడు.. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంగా ఉన్న లేక్​ వాల్దైకు సమీపంలోని ఓ ఎస్టేట్​లో ఉంటున్నట్టు రష్యన్​ ఇన్​వెస్టిగేటివ్​ న్యూస్​ సైట్​ ‘ది ప్రాజెక్ట్​’ పేర్కొంది.

120 మిలియన్​ డాలర్లు వెచ్చించి, ఈ ఎస్టేట్​ను రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు పుతిన్​. నిర్మాణ పనులు 2020లో మొదలై.. రెండేళ్లల్లో ముగిశాయి.

ఆ తర్వాత, గర్ల్​ఫ్రెండ్​తో కలిసి పుతిన్​ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఎస్టేట్​.. 13వేల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు.

గతంలో బయటకొచ్చిన ఫొటోల ప్రకారం ఈ ఎస్టేట్​లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, టేబుల్స్​ వంటి వస్తువులు ఉన్నాయని తెలుస్తోంది.

Putin's secret residence in the Russian countryside

 

ప్యాలెస్​లో అలినా కబేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది.

ఈ నిధుల నుంచి అలినాతో పాటు ఆమె బంధువులు కూడా లబ్ధి పొందుతున్నారని పేర్కొంది.

పుతిన్​, అలినాలు కలిసి ఉండటం తాము ఎప్పుడు చూడలేదని పలువురు అధికారులు పేర్కొన్నా.. అలా అని వారిద్దరు రిలేషన్​లో లేరని కాదని వివరించారు.

 

పుతిన్ అండతో రాజకీయాల్లోకి

పుతిన్ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనాకు ..2014లో రష్యా జాతీయ మీడియా బృందం బాధ్యతలను అప్పగించారు పుతిన్​.

అప్పటి నుంచి ఆమె ప్రతియేటా 8.6 మిలియన్​ యూరోలు జీతంగా అందుకుంటున్నారు. ఆరేళ్ల పాటు పార్లమెంట్ సభ్యురాలిగా వ్యవహరించారు.

నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ బోర్డు ఛైర్ పర్సన్ గా పనిచేశారు.

వ్లాదిమిర్​ పుతిన్​ ప్రత్యర్థి, ప్రస్తుతం జైలులో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీ బృందం.. 2021లో తొలిసారి ఈ ఎస్టేట్​ వివరాలను బయటపెట్టింది.

బడ్జెట్​ నిధులను దొంగలించి, ఈ ఎస్టేట్​కు నిర్మించారని నావెల్నీ బృందం ఆరోపించింది.