Last Updated:

Today Panchangam : నేటి ( మార్చి 3 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.

Today Panchangam : నేటి ( మార్చి 3 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 3 ) శుక్రవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి ఫాల్గుణం 12, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, ఏకాదశి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 10, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 03 మార్చి 2023 సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ఈరోజు ఏకాదశి తిథి ఉదయం 9:12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3:43 గంటల వరకు పునర్వసు నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత పుష్య నక్షత్రం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6:44 గంటల వరకు సౌభాగ్య యోగం ఉంటుంది. ఆ తర్వాత శోభన యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం 8:58 గంటల వరకు చంద్రుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : అమలకి, రంగభారీ ఏకాదశి

సూర్యోదయం సమయం 03 మార్చి 2023 : ఉదయం 6:45 గంటలకు

సూర్యాస్తమయం సమయం 03 మార్చి 2023 : సాయంత్రం 6:22 గంటలకు

 

నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:57 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:29 గంటల నుండి మధ్యాహ్నం 3:16 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:08 గంటల నుండి మరుసటి రోజు 12:57 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 6:19 గంటల నుండి సాయంత్రం 6:44 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 1:01 గంటల నుంచి మధ్యాహ్నం 2:49 గంటల వరకు

సర్వార్ధ సిద్ధి యోగం : ఉదయం 6:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:43 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..

రాహూకాలం : ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 12 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 7:30 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు

దుర్ముహర్తం : ఉదయం 9:04 గంటల నుండి ఉదయం 9:51 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:57 నుండి మధ్యాహ్నం 1:43 గంటల వరకు

భద్ర కాలం : సాయంత్రం 6:45 గంటల నుంచి రాత్రి 9:11 గంటల వరకు

నేటి పరిహారం : కుంకుమ పువ్వుతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి. అనంతరం ఆడపిల్లలకు పంచాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/