Last Updated:

Akhilesh Yadav: కేంద్రానికి కౌంట్ డౌన్ మెుదలైంది.. ఇక చూస్కోండి- అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: కేంద్రానికి కౌంట్ డౌన్ మెుదలైంది.. ఇక చూస్కోండి- అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: భాజపా కు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ Akhilesh Yadav అన్నారు. కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని..
ఖమ్మం సభా వేదికగా అఖిలేష్ ప్రకటించారు. దేశంలో అరాచక పాలన సాగుతుందని.. ఆ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం వచ్చిందని అఖిలేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కాపీ కొడుతుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం కావాలనే ఇబ్బందులకు గురిచేస్తుందని అఖిలేష్ అన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని భాజపాను ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.

దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలను కేంద్రం భయపెడుతుందని అలాంటి వాటికి భయపడమని అఖిలేష్ అన్నారు.

ఈ రోజు నుంచి కేవలం భాజపాకు 399 రోజులే మిగిలి ఉన్నాయన్నారు.

కేంద్రం అనేక వాగ్దానాలు చేసి.. ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

రైతుల్ని మోదీ దారుణంగా మోసం చేశారని.. తెలంగాణ పథకాల్నే కేంద్రం కాపీ కొడుతుందని ఆరోపించారు.

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. దేశంలో ఎన్నడు లేనంతగా నిరుద్యోగం పెరిగిందని అన్నారు.

బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం దక్షిణాది నుంచి.. అది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీలో కూర్చొని ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా చూస్తుందని ఆరోపించారు. దేశంలో మత ఘర్షణలు సృష్టిస్తుందని.. ఇలాంటి పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలని సూచించారు.

భాజపా ప్రభుత్వం ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని.. ఆ పార్టీని ఘోరంగా ఓడించాలని అఖిలేష్ పిలుపునిచ్చారు.

రైతులను ఆదుకునే ప్రభుత్వం కావాలే తప్పా.. రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం మనకొద్దని సూచించారు.

కేంద్ర ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/