Last Updated:

Producer Am Rathnam : పవన్ కళ్యాణ్ దేవుడు… ఆయన్ని చూస్తుంటే ఎంజీఆర్ గుర్తొస్తున్నారు : ఏఎం రత్నం

Producer Am Rathnam : పవన్ కళ్యాణ్ దేవుడు… ఆయన్ని చూస్తుంటే ఎంజీఆర్ గుర్తొస్తున్నారు : ఏఎం రత్నం

Producer Am Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, హరిహర వీరమల్లు చిత్రాల నిర్మాత ఏఎం రత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు చిత్రం గురించి ప్రైమ్ 9 వెబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులో మాటల్ని బయటపెట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల దృష్టిలో దేవుడని… ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదన్నారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే తొలితరం తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ గుర్తుకొస్తారని తెలిపారు. ఎంజీఆర్, పవన్ కళ్యాణ్ శైలి ఒకేలా ఉంటుందని అన్నారు.

పవన్ కళ్యాణ్ ను హీరోగా కంటే తాను వ్యక్తిగానే ఆరాధిస్తానని, చాల అరుదైన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతమంటూ ప్రశంసించారు. చీమకు హాని జరిగిన పవన్ కళ్యాణ్ తట్టుకోలేరని… ఇక తన పక్కనున్నవారి కష్టాన్ని తన కష్టంగా భావించి… వారి కష్టాలను తీర్చేందుకు ఎంతదూరమైనా వెళ్తారని కొనియాడారు. కౌలు రైతుల కష్టాలు చూసి తట్టుకోలేక తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులను సైతం తనకు మిగిల్చుకోకుండా అన్ని ఇచ్చేసే గుణం పవన్ కళ్యాణ్ కి తప్ప మరెవరికి ఉంటుందని ఏఎం రత్నం వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఖుషి రీ రిలీజ్ సన్నాహాల్లో ఉన్నానని… క్రిష్ దర్శకత్వంలో హరహర వీరమల్లు సినిమా అద్భుతంగా వస్తుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా అందరికి నచ్చేలా సినిమా రూపుదిద్దుకుంటుందని హర్షం వ్యక్తం చేసారు. హరహర వీరమల్లు షూటింగ్ 65 శాతం పూర్తయిందని… పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తుందని రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖుషి సినిమా ఇప్పుడు చుసిన కొత్త అనుభుతినే ఇస్తుందని, ఆ ప్రేమకథలో ఉండే మ్యాజిక్కే వేరన్నారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్- భూమికల కెమిస్ట్రీ, పీసీ శ్రీరామ్ విజువల్స్, మణిశర్మ సంగీతం, ఎస్ జె సూర్య టేకింగ్ అన్ని కలిపి సినిమాను క్లాసిక్ మూవీ గా మార్చాయని అన్నారు. కొత్త సంవత్సరంలో హరిహర వీరమల్లు రూపంలో మరో కానుక ఫ్యాన్స్ కి ఇస్తామని… సర్ ప్రైజ్ కి రెడీ గా ఉండాలన్నారు.

పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు ఉపందుకున్నాయని, కానీ తాను ఎప్పుడో భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి పాన్ ఇండియా చిత్రాలను అందించానని గుర్తు చేశారు. ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ప్రకటించిన సత్యాగ్రహి సినిమాను మరోస్థాయిలో నిర్మించాలని అనుకున్నప్పటికీ కథ పూర్తిగా సిద్ధంకాక పోవడంతో సినిమా మొదలు కాలేదని ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే 7/జి బృందావన్ కాలనీకి సీక్వెల్ తీసుకురానున్నట్లు చెప్పుకొచ్చారు. నటుల్లో పవన్ కళ్యాణ్, దర్శకులలో శంకర్, టి కృష్ణ లంటే తనకు ఎనలేని అభిమానమన్నారు ఏఎం రత్నం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి: