Bihar: బీహార్ కల్తీ మద్యం కేసు.. 39కు చేరిన మృతుల సంఖ్య
బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.
Bihar: బీహార్‌లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. కల్తీ మద్యమే ప్రమాదానికి కారణమని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
పెరుగుతున్న మరణాల సంఖ్య, ప్రభుత్వ నిషేధాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం బీహార్ అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. నిషేధం లేని చోట కూడా ప్రజలు చనిపోతున్నారని సీఎం నితీశ్ కుమార్ మండిపడ్డారు.బీహార్‌లో మద్య నిషేధం అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం ఉంది, మద్యంపై నిషేధం లేనప్పుడు ఇక్కడ కూడా ప్రజలు చనిపోతున్నారు మేము నిషేధాన్ని అమలు చేసాము” అని ఆయన అన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మద్యం సేవించకూడదని గుర్తుంచుకోండి. మీరు తాగితే చనిపోతారు అంటూ వ్యాఖ్యానించారు.
కల్తీ మద్యం ఘటన నేపధ్యంలో మర్హౌరా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ యోగేంద్ర కుమార్‌పై శాఖాపరమైన చర్య మరియు బదిలీకి సిఫార్సు చేయబడింది. పెరుగుతున్న మరణాల కారణంగా మస్రఖ్ సబ్ డివిజన్ అధికారి రితేష్ మిశ్రా మరియు కానిస్టేబుల్ వికేష్ తివారీలను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటన దుమారం రేపడంతో బీహార్ ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా కల్తీ మద్యం తాగడం వల్ల మరణాలు సంభవించాయని, అక్కడ మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు.మరోవైపు, జిల్లా యంత్రాంగం అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది, వారు బాధిత గ్రామాల్లో పర్యటించి, అక్రమ మద్యం సేవించిన వారిని గుర్తిస్తారు.