Citroen eC3: సిట్రియెన్ eC3.. సేఫ్టీ రేటింగ్ తెలిస్తే షాకవుతారు..!
Citroen eC3: సిట్రియెన్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక కారు eC3. ఫీల్, షైన్ అనే రెండు వేరియంట్లలో కంపెనీ విక్రయిసస్తోంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.12.7 లక్షలు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిమీ పరుగెత్తుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ కారులో సింగిల్ 29.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ యూనిట్, ఒక ఫ్రంట్ మోంటెడ్ మోటర్ మాత్రమే ఉంటుంది. ఇది 56 బీహెచ్‌పీ పవర్, 143 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే ఫుల్ ఛార్జ్‌పై రేంజ్ తక్కువగా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సిట్రియెన్ eC3 ఫుల్ ఛార్జ్ తర్వాత డిఫాల్ట్‌గా సెట్ చేసిన స్టాండర్డ్ డ్రైవ్ మోడ్ (రీజియన్ మోడ్)లోకి వెళుతుంది. డ్రైవింగ్ సమయంలో AC ఉష్ణోగ్రత 21 నుండి 23 డిగ్రీల మధ్య సెట్ చేశారు. ఈ కారులో మాన్యువల్ AC ఉన్నందున, నాబ్ 23 డిగ్రీలకు అడ్జెస్ట్ చేశారు. అలానే ఫ్యాన్ స్పీడ్ నంబర్ వన్ స్థానంలో ఉంచారు. దీని ప్రారంభ ధర రూ. 12.76 లక్షలు.
టెస్టింగ్‌లో Citroen eC3 సిటీలో 75 శాతం, హైవేపై 25 శాతం డ్రైవ్ చేశారు. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడానికి ముందు 218.8కిమీల దూరాన్ని కవర్ చేయగలిగింది. అయితే ఆ తర్వాత కారు స్టార్ట్ కాలేదు. బ్యాటరీ 5 శాతం మిగిలి ఉన్నప్పుడు దాని AC స్విచ్ ఆఫ్ చేశారు. అదే సమయంలో 2 శాతం బ్యాటరీ మిగిలి ఉన్నప్పుడు దాని గరిష్ట వేగం గంటకు 10 కిమీ.
ఈ eC3 దాని ICE తో C3ని పోలి ఉంటుంది. ఖాళీగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ ఫెండర్‌లో ఛార్జింగ్ ఫ్లాప్ మినహా అన్నీ అలాగే ఉంటాయి. దీని ఇంటీరియర్ క్యాబిన్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.2-అంగుళాల డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, కలర్ ఆప్షన్లతో కూడిన ఫాబ్రిక్ సీట్లు పొందుతుంది. గ్లోబల్ NCAPలో పెద్దల భద్రత కోసం 0-స్టార్ సేఫ్టీ రేటింగ్, పిల్లల భద్రత కోసం 1-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే పొందింది. భద్రత కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, బెల్ట్ లోడ్ లిమిటర్ ఉన్నాయి.