Twitter Employees: ఉద్యోగుల తొలగింపు.. పునరాలోచించండి.. ఎలాన్ మస్క్ కు లేఖ
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులు లేఖ వ్రాశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే 75శాతం ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పునారోలోచించాలని సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు మస్క్ కు లేఖ వ్రాశారు.
Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులు లేఖ వ్రాశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే 75శాతం ఉద్యోగుల తొలగింపు నిర్ణయం పై పునారోలోచించాలని సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు మస్క్ కు లేఖ వ్రాశారు.
సిబ్బందిని తొలగించాలన్న నిర్ణయం అనాలోచితమైందని వారు పేర్కొన్నారు. దీని ప్రభావం సమాచారాన్ని అందించడంలో చూపుతుందన్నారు. ట్విట్టర్ పై పెట్టుకొన్న యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేయడంగా తెలిపారు. ఒక విధంగా తొలిగింపు పదం, ఉద్యోగులను బెదిరింపు భావించాల్సి ఉంటుందిని పేర్కొన్నారు. వేధింపుల నడుమ విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుందని తెలిపారు.
ఉద్యోగులను తొలగించాలంటే న్యాయబద్దమైన విధానాలు ఉండాలని లేఖలో ప్రస్తావించారు. ఇంటి నుండి పని వంటి ప్రయోజనాలన్నింటినీ కొనసాగించాలని ఎలాన్ మస్క్ కు కోరారు. ఉద్యోగులు, యాజమాన్యం మద్య సైద్ధాంతికపరమైన వ్యత్యాసాలు ఉండకూడదని వారు స్పష్టం చేశారు. జాతి, జెండర్, వైకల్యం, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగుల పై పక్షపాతం చూపించొద్దని వారు లేఖలో కోరారు.
ట్విట్టర్ ను కొనుగోలు చేస్తామని ప్రకటించిన నాటి నుండి ఎలాన్ మస్క్ అధికంగా వార్తల్లో నిలిచారు.
ఇది కూడా చదవండి: Philips to cut 5% of workforce: ఫిలిప్స్ కంపెనీలో 4వేల ఉద్యోగాలు హుష్..