Last Updated:

Elon Musk:ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ రెండు ఘటనలకు లింక్!

Elon Musk:ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ రెండు ఘటనలకు లింక్!

Elon Musk On Cybertruck Explosion Outside Trump Hotel: అగ్రరాజ్యం అమెరికాలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించారు. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.

అలాగే, లాస్ వెగాస్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ బయట కూడా సైబర్ ట్రక్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదాలపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టూరో రెంటల్ వెబ్‌సైట్ నుంచి ఆ రెండు కార్లను అద్దెకు తీసుకున్నారని ఆరోపించారు.