Rushi Sunak: కొత్త యుకె ప్రధాని రుషి సునాక్.. భగవద్గీత పై ప్రమాణం చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్..
మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి.
London: మన దేశ మూలాలు కల్గిన వ్యక్తి, యునైటెడ్ కింగ్ డమ్ నూతన ప్రధాని రుషి సునాక్ కు సంబంధించిన అనేక విషయాలు నెట్టింట ట్రోల్ అవుతున్నాయి. 10 అంశాలతో రుషి సునాక్ గొప్పతనాన్ని తెలియచేస్తున్నాయి. ప్రధానంగా భారత దేశంతో ముడిపడివున్న రుషి సునాక్ అనుబంధాలపై సర్వత్రా చర్చ సాగుతుంది. రుషి సునాక్ తల్లి తండ్రులు యశ్వీర్ సునాక్, ఉషా సునాక్ లు ఇద్దరూ భారత సంతతికి చెందినవారు కాగ, 1960లో తూర్పు ఆఫ్రికా నుండి బ్రిటన్ కు వలస వచ్చారు. తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టీషనర్, తల్లి కెమిస్ట్ వ్యాపారం చేసేవారు.
ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహనం చేసుకొన్న రుషి సునాక్ దంపతులకు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతడు తరచూ వారసత్వాలపై మాట్లాడుతూ, కుటుంబ విలువలు, సంస్కృతిని గుర్తు చేస్తుంటారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసిన రుషి సునాక్ విద్యాభాసంపై మక్కువ కల్గిన వాడు కావడంతో పిల్లల పెంపకంలో కూడా దాని ప్రభావం ఏర్పడింది. దూరాన్ని దగ్గర చేసేదే ప్రేమగా భావించే రుషి సునాక్ పలుమార్లు కుటుంబ సమేతంగా బెంగళూరుకు వచ్చి అత్తమామలను కలిసి వెళ్లుతుంటారు.
గత ఎన్నికల ప్రచారంలో రుషి సునాక్, ప్రతిపక్ష పార్టీల నుండి ధనవంతుడిగా విమర్శలు అందుకొనివున్నాడు. అందుకు అతడు ధరించే వస్త్రధారణ, నివాసాలు ఉండే ఖరీదైన ఇండ్లు కారణంగా చెప్పవచ్చు. అయితే ఆ సమయంలో భగవద్గీత నన్ను రక్షిస్తుందని పదే పదే సన్నిహితుల దగ్గర వ్యక్త పరిచేవాడు. సుమారుగా 700 మిలియన్ పౌండ్లకు పైగా ఆస్తులు కల్గిన రుషి సునాక్, యార్క్ షైర్ లో ఓ ఇల్లు, లండన్ లో కెన్సింగ్టన్ లో కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఎంతటి వత్తిడినైనా జయించేందుకు శారీరక వ్యాయామం అవసరమని భావిస్తూ రుషి సునాక్ క్రికెట్ ఆటకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
ఇది కూడా చదవండి:Rishi Sunak: రుషి సునాక్ ను వరించిన బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి