Last Updated:

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

సోనియా, రాహుల్‌ గాంధీలను విచారించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

National Herald case: సోనియా, రాహుల్‌ గాంధీలను విచారించిన తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. అధికారవర్గాల సమాచారం ప్రకారం మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ న్యూఢిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ పేపర్‌తో పాటు మొత్తం 12 లొకేషన్లలో సోదాలు మొదలుపెట్టింది.

కాగా ఈడీ గత నెల 27వ తేదీన సోనియాగాంధీని సుమారు మూడు గంటల పాటు నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి విచారించింది. ఈడీ ప్రధానంగా సోనియాను నేషనల హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌లో జరిగిన ఆర్థిక పరమైన అవకతవల పై గురించి ప్రశ్నించింది. సోనియాతో పాటు కాంగ్రెస్‌ నాయకులు పవన్‌ బన్సల్‌, మల్లిఖార్జున ఖర్గెలను కూడా గతంలో ఈడీ విచారించింది.

అంతకు ముందు రాహుల్‌గాంధీని జూన్‌ నెలలో సుమారు ఐదు రోజుల పాటు సుమారు 50 గంటల పాటు విచారించింది. గత ఏడాది చివర్లో సోనియాగాంధీపై కొత్తగా మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈడీ సోనియాను పిలిపించి విచారించింది. 2013లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు మేరకు సోనియా, రాహుల్‌పై విచారణ మొలైంది. కాగా నేషనల్‌ హెరాల్డ్‌లో సోనియా, రాహుల్‌గాంధీకి మెజారిటి వాటాలు ఉన్నాయి. అయితే ఈడీ విచారణలో వీరిద్దరు నేషనల్‌ హెరాల్డ్‌ గురించి తమకు పెద్ద ఏమీ తెలియదని, కార్యదర్శి పార్టీ కోశాధికారిగా ఉన్న మోతీలాల్‌ వోహ్రాకు తెలుసునని చెప్పారు.

ఇవి కూడా చదవండి: