Home / ED Raids
Former CM and YSRCP chief YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు బిగ్‌షాక్ తగిలింది. జగన్‌కు సంబంధించిన రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేస్తున్నట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు తీసుకున్నారు. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు పలు కంపెనీలకు లాభాలు కలిగించగా, వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్, బెంగుళూరులో ఉన్న ల్యాండ్స్ కొన్ని కంపెనీల్లో వాటాలు […]
ED officers’ searches : హైదరాబాద్‌లో గురువారం రెండోరోజూ కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్ డైరెక్టర్ల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నరేంద్ర సురానాతోపాటు సాయి సూర్య డైవలపర్స్ సతీశ్ ఇంట్లో పెద్దమొత్తం నగదు పట్టుబడినట్లు తెలుస్తున్నది. పలు షెల్ కంపెనీలు ఏర్పాటు.. సురానా ఇండస్ట్రీస్ ఎండీ పలు షెల్ […]
హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
:జార్ఖండ్ మంత్రి అలమ్‌గిర్ ఆలమ్ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జార్ఖడ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది.
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. 15 బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాలినేని సాంబశివరావు నివాసం, కార్యాలయంతో పాటు పలువురి నివాసాల్లో సోదాలను చేపడుతున్నట్టు సమాచారం అందుతుంది.
మనీలాండరింగ్ కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. పొన్ముడి తనయుడు, లోక్‌సభ ఎంపీ గౌతం సిగమణిపై కూడా సోదాలు జరుగుతున్నాయి
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.