Published On:

Hacking Websites in Gujarat: ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెబ్‌సైట్ల హ్యాక్.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Hacking Websites in Gujarat: ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో వెబ్‌సైట్ల హ్యాక్.. ఇద్దరు నిందితుల అరెస్ట్

2 Arrested For Hacking Websites in Gujarat: గుజరాత్‌లో ఇద్దరు హ్యాకర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మైనర్ సహా అన్సారీని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ పలు భారతదేశానికి సంబంధించిన వెబ్ సైట్లను హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతుండగా వెబ్‌సైట్ల హ్యాక్ చేశారు.

 

కాగా, హ్యాక్ చేసిన నిందితులు వెబ్‌సైట్లలో భారత వ్యతిరేక సందేశాలు పోస్టింగ్ చేశారు. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్‌ను సైతం ఈ హ్యాకర్లు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. 12వ తరగతి ఫెయిలైనా హ్యాకింగ్‌పై నిందితులకు పట్టు ఉండడంతో పలు వెబ్ సైట్లను హ్యాక్ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు నిందితుల ఫోన్లను ఏటీఎస్ ఫోరెన్సిక్‌కు పంపించింది.

 

ఇదిలా ఉండగా, భారత ప్రభుత్వ వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత 9 నెలలుగా 50కి పైగా ఈ వెబ్ సైట్లపై దాడి చేసినట్లు వెల్లడించారు. అయితే నిందితులకు ఎవరైనా సహాయం చేస్తున్నారా లేదా ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సునీల్ జోషి తెలిపారు.