Last Updated:

Telangana Budget: రూ.3,04,965 కోట్లతో బడ్జెట్.. తెలంగాణ అప్పులు ఎంతంటే?

Telangana Budget: రూ.3,04,965 కోట్లతో బడ్జెట్.. తెలంగాణ అప్పులు ఎంతంటే?

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో తొలిసారి కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని అన్నారు. ప్రజా సంక్షేమమేతమకు ముఖ్యమని వెల్లడించారు. ప్రధానంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుత బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందన్నారు.

 

మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లు ఉండగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. ఇక ఈ ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు అని వెల్లడించారు. జీఎస్‌డీపీ దీని వాటా 28.1 శాతం అని తెలిపారు. 2024-25లో తలసరి ఆదాయం రూ.3,79,751 అని, ఇదే సమయంలో తలసరి ఆదాయం రూ.2,05,579గా ఉందని చెప్పారు. కాగా, అసెంబ్లీలో మంత్రి భట్టి విక్ర మార్క బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటా 43 నిమిషాల పాటు సాగింది.

 

శాఖలవారీగా కేటాయింపులు ఎలా ఉన్నాయంటే.. పౌరసరఫరాలు రూ. 5,734 కోట్లు, వ్యవసాయం రూ.24,439, విద్య రూ. 23,108, పశు సంవర్ధకం రూ. 1,674, పంచాయతీరాజ్ రూ. 31,605, కార్మిక శాఖ రూ.900 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం రూ..2,862, బీసీ సంక్షేమం రూ.11,405, ఎస్టీ సంక్షేమం రూ.17,169, ఎస్సీ సంక్షేమం రూ.40,232, మైనార్టీ సంక్షేమంరూ.3,591, చేనేత రంగం రూ.371 కోట్లు, ఐటీ రంగం రూ.774 కోట్లు, పరిశ్రమల శాఖ రూ.3,527, నీటి పారుదల శాఖ రూ.23,373, అర్బన్ డెవలప్మెంట్ రూ.17,677, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ రూ.150 కోట్లు, రోడ్లు భవనాల శాఖ రూ.5907, హోమ్ శాఖ రూ. 10,188, అడవులు, పర్యావరణం రూ. 1,023, క్రీడా శాఖ రూ.465 కోట్లు, దేవాదాయ శాఖ రూ.190 కోట్లు కేటాయించారు.

ఇవి కూడా చదవండి: