Home / Telangana Budget
Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో తొలిసారి కాంగ్రెస్ సర్కార్ పూర్తిస్థాయి బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లలో సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని అన్నారు. ప్రజా సంక్షేమమేతమకు ముఖ్యమని వెల్లడించారు. ప్రధానంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి […]
Telangana Budget 2025-26 to be presented by batti Vikramarka: తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. 2025-26 ఏడాదికి సంబంధించి పద్దులు రూ.3లక్షలకుపైగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే 2024-25 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్లు కాగా, ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఇదే కావడం విశేషం.
Telangana Budget Session 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. అప్పులతో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన జరిగిందని, కులగణనలో కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదన్నారు. కులగణనపై అభినందించకుండా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతుబంధు […]
Telangana Assembly Budget Sessions 2025: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు వచ్చారు. ఈ మేరకు ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభ్యులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన విధి విధానాలు, […]