Sankranthiki Vastunam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్‌టైం రికార్డు – ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ చేసిన వెంకీమామ, ఒక్క రోజే అత్యధిక షేర్..
sankranthiki vasthunnam all time record: ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. కాగా ఈ పండుగ సందర్భంగా థియేటర్లోకి వచ్చి బ్లాక్‌బస్టర్ పొంగల్‌గా నిలిచింది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్ పండగ మూవీగా నిలిచింది. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్దలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పోటిపడ్డాయి.
ఇందులో గేమ్ ఛేంజర్ సైలెంట్ కాగా.. ‘డాకు మహారాజ్’ మొదట్లో అదరగొట్టింది. జనవరి 14న వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ మూవీని సైతం వెనక్కి నెట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతుంది. ఐదు రోజుల్లోనే రూ. 161 పైగా కోట్లు గ్రాస్ చేసింది. అయితే ఆరో రోజు కూడా ఈ మూవీ మరింత కలెక్షన్స్ రాబట్టడమే కాదు అరుదైన రికార్డు బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్పై ఉన్న ఆ రికార్డును ఇప్పుడు వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కొల్లగొట్టింది.
ఏపీ, తెలంగాణలో ఆరు రోజుల్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు నెలకొల్పింది. ఇక అలాగే ఒక్క రోజే అత్యధిక షేర్ చేసిన తెలుగు సినిమాగా వెంకీమామ అరుదైన రికార్డు అందుకున్నారు. నిన్న(జనవరి 18) ఒక్క రోజే ఎక్కువ షేర్ (రూ. 9.54 షేర్) రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఉండేది. ఇప్పుడు దానిని సంక్రాంతికి వస్తున్నాం బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకుంది.
#SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥
ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥
ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk
— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025
6 రోజుల్లోనే రూ. 100 కోట్ల షేర్ రాబట్టిన సినిమా ఒక్క ఆరవ రోజే రూ. 9.54 కోట్ల షేర్ చేసినట్టు సమాచారం. విక్టరీ వెంకటేష్ కెరీర్లో హయ్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన ఆల్‌టైం రికార్డుగా నిలిచింది. అటూ నార్త్ అమెరికాలోనూ యమ జోరు చూపిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ కలెక్షన్స్ చేసింది. యూకేలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఇక బుక్‌మై షోలో టికెట్స్ సైతం హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మరోవైపు డాకు మహారాజ్ మూవీ కూడా దూసుకుపోతంది. 8 రోజుల్లో ఈ సినిమా రూ. 156 పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు మూవీ టీం ప్రకటించింది.