Last Updated:

Varahi : జనసేనాని పవన్ కళ్యాణ్ కి షాక్ … వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా !

Varahi : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ మాటల యుద్దానికి దిగుతున్నారు. ఇక జనసేన అధినేత త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన ప్రచార రధం

Varahi : జనసేనాని పవన్ కళ్యాణ్ కి షాక్ … వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా !

Varahi : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ మాటల యుద్దానికి దిగుతున్నారు. ఇక జనసేన అధినేత త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఆయన ప్రచార రధం వారాహి కూడా సిద్దమైంది. కానీ గత కొన్ని రోజులుగా వారాహి గురించి వైకాపా – జనసేన మధ్య వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. రక్షణ రంగానికి మాత్రమే అనుమతి ఉన్న ఆలీవ్‌ కలర్‌ ఎన్నికల ప్రచార రథానికి ఎలా వాడతారంటోంది వైసీపీ ఆరోపిస్తుంది. అలానే ఇది చట్టానికి విరుద్దమంటూ మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ కూడా కోట్‌ చేస్తోందని అంటున్నారు.

అయితే ఈ అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఇటీవల ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర పోస్ట్ లు పెడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. కారు నుంచి కట్‌డ్రాయర్‌ కంపెనీల దాకా రాష్ట్రం వదిలిపారిపోతున్నాయి… రంగుల మీద కాకుండా ముందు రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టాంటూ ట్వీట్‌ చేశారు. అలానే రూల్స్ అనేవి పవన్ కళ్యాణ్ ఒక్కడికి మాత్రమేనా మరొకరికి వర్తించవా అంటూ ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న బైక్, కార్ ఫోటోలను పోస్ట్ చేసి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ వివాదంపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి వైకాపా నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జనసేనకు అనుకోని షాక్ తగిలినట్టు అయ్యింది.

తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి రిజిస్ట్రేషన్ వాయిదా వేసినట్లు సమాచారం అందుతుంది. లారీ ఛాసిస్ ను బస్సుగా మార్చడం పట్ల అధికారులు అభ్యంతరం వ్యక్తం చీస్తున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా బస్సు అని చెప్పినప్పుడు బస్సు ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం కూడా ఇక్కడ సమస్యగా పరిగణిస్తున్నారు. మైన్స్ లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్ల మీద ఎలా వాడుతారు అంటూ ప్రశ్నించినట్లు అంటున్నారు. ఆర్మీకి సంబంధించిన కలర్ ను ఎలా ఒక సివిల్ వాహనానికి ఉపయోగిస్తారని… ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలం అని చెప్పడంతో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మాతృ ఈ విషయంపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో అని.

ఇవి కూడా చదవండి: