Last Updated:

Janasena Yuvashakthi: కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు

Janasena Yuvashakthi: కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు

Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు కుటుంబ రాజకీయాలపై చక్కగా వివరించారు. ఈ యువకుడు మాట్లాడిన తీరు ఎంతగానో కదిలించింది. సమస్య ఎదురైనపుడు పారిపోవద్దని.. ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని పరోక్షంగా జన సైనికులకు ఎనర్జీ నింపారు.

వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ పాలనను చూసి జన సైనికులు ధైర్యంగా పోరాడాలని.. వైసీపీ గుండాలను భయపడమని ధైర్యం చెప్పారు.

రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని.. వారి కుటుంబాలకు ఊడిగం చేయడానికే మనం ఉన్నామా అని ప్రశ్నించిన తీరు అమోఘం.

కానిస్టేబుల్ కొడుకు పార్టీకి, సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు ఇస్తున్నానంటూ జన సైనికులకు ఉత్సాహపరిచాడు. విజయవాడలో ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ తరపునా వారికి అండగా ఉంటున్నానని ఆ యువకుడు తెలిపాడు.

వైసీపీ నేతలు తనను ఎత్తుకెళ్లిన భయపడలేదని.. ధైర్యంగా కార్పొరేటర్ గా పోటీ చేశానని అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడలేదని అన్నాడు. ఇలాంటి ధైర్యం ప్రతి ఒక్క జనసైనికుడికి ఉండాలని సూచించాడు. సూర్యుడి కిరణాలు సముద్రం మీద పడ్డంత మాత్రనా.. సముద్రం ఎండిపోదని.. అలాంటివాటికి జనసైనికులు భయపడరని అన్నాడు.

వైసీపీ పతనం ఖాయం

జనసేన పార్టీని ప్రజల్లోకి మరింత ముందుకు తీసుకెళాతమని.. పవన్ కళ్యాణ్ ఎదుట పార్టీపై ఉన్న నమ్మకాన్ని వివరించాడు. రాష్ట్రంలో విద్య, వైద్య, ఉపాధి, రాజ్యాధికారం కోసమే జన సైనికులు(Janasena Yuvashakthi) శ్రమించాలని హుస్సేన్ ఖాన్ కోరాడు. తమను దోచుకుంటున్న వైసీపీ నేతలకు తగిన బుద్ది చెప్పాలని కోరాడు.

నాది నాది అనుకున్న సీఎం నిన్న చంద్రబాబుది, నేడు జగన్‌దీ.. రేపు పవన్ కళ్యాణ్‌దే అని.. ఇక్కడితో వైసీపీ పతనం ప్రారంభమైందని హుస్సేన్ ఖాన్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter:  https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: