Last Updated:

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Varahi: రణస్థలిలో జరుగుతున్న యువశక్తి కార్యక్రమంలో నాగబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజల పాలన పట్టించుకోని ప్రభుత్వం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రను అడ్డుకునేందుకే ప్రభుత్వం 1 జీవో తెచ్చిందని నాగబాబు విమర్శించారు. వారాహిని చూస్తే వైసీపీ నాయకులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని అన్నారు. అందుకే వారాహి (Varahi) వాహనంపై రాద్దాంతం చేశారని నాగబాబు ఆరోపించారు. అణచివేత చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని అన్నారు.

ఉద్యోగాలు లేక విలవిల

రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ఇవేమి జగన్ కు పట్టవా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు వేయకుండా కాలయాపన చేయడంతో యువతలో దాగి ఉన్న శక్తి నిర్వీర్యం అవుతుందని నాగబాబు(Nagababu) విమర్శించారు. ఈ సందర్భంగా ఓ ప్రముఖ హిందీ పాటను పాడిన నాగబాబు.. ఆ పాటకు అర్ధం వివరించారు. మేము చూస్తాం మేము చూస్తాం.. మీ నియంతృత్వ పోకడలున్న ప్రభుత్వ పతనాన్ని మేను చూస్తాం. ఈ ప్రభుత్వం పడిపోవడం తథ్యమన్నారు. తారాస్థాయికి చేరిన వైసీపీ అరాచకాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందని నాగబాబు విమర్శించారు.

రాష్ట్రంలో అరాచక పాలన

ప్రజలను పట్టించుకోని నాయకులు ఎక్కువ రోజులు మనుగడ సాధించరని.. పలు ఉదాహరణలను నాగబాబు చెప్పారు. ప్రజలను హింసించిన నియంతలు.. తాడే పామై తమనే కరవడానికి రావడాన్ని చూసి మతి చెలించినట్లు ఏమి చెప్పలేక చేయలేక పోతున్నారని ఘటుగా విమర్శించారు. పులులమని వైసీపీ నాయకులు చెప్పుకొని తిరుగుతున్నారని.. కాని వారు పిరికతనం అనే పాలు తాగుతారని నాగబాబు అన్నారు.

జగన్ పాలనను తరిమికొట్టి.. రాష్ట్రంలో సుపారిపాలన అందించాలని ఈ సందర్భంగా యువతకు నాగబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీకి మరోసారి పాలన అప్పగించి పిల్లల భవిష్యత్ నాశనం చేయకూడదని నాగబాబు కోరారు.

వైసీపీ కుట్రలకు జన సైనికులు ఎవరు భయపడరని.. వైసీపీ ని ఎదుర్కునే దమ్ము జన సైనికులకు ఉందని ఆయన అన్నారు. ఎన్ని కుట్రలు.. కుతంత్రాలు చేసిన జనసేన పార్టీని అడ్డుకోలేరని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

Veera Simha Reddy: అప్పుడు తొడకొడితే రైలు వెనక్కి.. ఇప్పుడు తంతే కారు వెనక్కి.. బాలయ్యకు లాజిక్‌లు ఉండవ్..

Jagan vs Adnan Sami: అద్నాన్ సమీ vs వైసీపీ మంత్రులు.. తెలుగు జెండా వివాదం ఏంటి?

Somesh Kumar: ఏపీ ప్రభుత్వానికి సోమేశ్ కుమార్ రిపోర్ట్.. సీఎం జగన్ తో భేటీ

Vande Bharat Express: విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై రాళ్లదాడి

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: