Last Updated:

AP Highcourt : జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. జీవో 1 సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు.

AP Highcourt : జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్.. జీవో 1 సస్పెండ్

AP Highcourt : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల ప్రాథమిక హక్కును హరించేలా జీవో ఉందని తన పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. జీవో నంబర్ 1పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించి ప్రభుత్వం జీవోని రద్దు చేయాలని కోరారు.

జీవో నంబర్‌-1పై హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. సీపీఐ నేత రామకృష్ణ అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును కోరారు. ఏజీ శ్రీరామ్ ఈ పిల్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌పై విచారణ జరిపే అధికారం లేదన్నారు. అయితే పిల్‌పై తాము అత్యవసరంగా విచారణ జరుపుతామని వెకేషన్‌ కోర్టు తెలిపింది. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదని.. వెకేషన్‌ బెంచ్‌ విధాన నిర్ణయాల కేసులపై విచారణ జరపకూడదు అన్నారు. అయితే తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు జీవో నెంబర్ వన్ ను సస్పెండ్ చేసింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది.

అలానే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. రామకృష్ణ తరపున అశ్వినీ కుమార్.. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని వాదనలను వినిపించారు.

బ్రిటిష్ కాలంనాటి చట్టాన్ని తీసుకొచ్చారని, అప్పుడు కూడా లేని నిబంధనలను ఇప్పుడు విధించారని చెప్పారు.

ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నెల 23వ తేదీ వరకు జీవోపై సస్పెన్షన్ విధించింది. తదుపరి విచారణను జనవరి 23కి వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని.. కానీ జీవో జారీ చేసిన మరుసటి రోజే రాజమండ్రిలో జగన్ రోడ్ షో నిర్వహించారని అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రజల హక్కులను హరించడానికే ఈ జీవోను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1

Janasena Yuvashakthi: తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు

Janasena Yuvashakthi: జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: