Last Updated:

Realme GT 7 Pro Racing Edition: మీరు ఊహించలేరు.. మొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఫోన్ వచ్చేసింది.. కొన్నారంటే?

Realme GT 7 Pro Racing Edition: మీరు ఊహించలేరు.. మొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఫోన్ వచ్చేసింది.. కొన్నారంటే?

Realme GT 7 Pro Racing Edition: రియల్‌మి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5G ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ‘Realme GT 7 Pro Racing Edition’ పేరుతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో Realme GT 7 ప్రో రేసింగ్ ఎడిషన్ పరిచయం చేసింది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌కు వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. దీని ధర రూ.59,999. ఇప్పుడు, రియల్‌మి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఫోన్‌ను ఆవిష్కరించింది.

అవును, Realme GT 7 Pro రేసింగ్ ఎడిషన్ ఈరోజు అధికారికంగా ప్రారంభించింది. ఇందులో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6500mAh, 120W స్పీడ్ ఛార్జింగ్ సామర్థ్యంతో కూడిన పెద్ద బ్యాటరీ కూడా ఉంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 16GB RAM + 512GB స్టోరేజ్‌తో సహా అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ చేశారు

Realme GT 7 Pro Racing Edition Features And Specifications
రియల్‌మి జీటీ 7 ప్రో రేసింగ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే. డిస్ప్లే గరిష్టంగా 6,000 నిట్‌ల బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 3 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై నిర్మించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో పనిచేస్తుంది.

రియల్‌మి జీటీ 7 ప్రో రేసింగ్ ఎడిషన్ 12GB RAM +16GB RAM కలిగి ఉంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్‌లో 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ఉంది. టాప్ వేరియంట్ 16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్‌ను పొందుతుంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. ఇది OIS సాంకేతికతను కలిగి ఉంది.

8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రేసింగ్ ఎడిషన్ 6500mAh కెపాసిటీ కలిగిన పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 120W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ ఫోన్‌లో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్. NFC ఉన్నాయి.

రియల్‌మి జీటీ 7 ప్రో రేసింగ్ ఎడిషన్ నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 36,820గా ఉంది. 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,950. 16GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,390గా నిర్ణయించారు. ఇది బ్లూ నెప్ట్యూన్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్, స్టార్ ట్రైల్ టైటానియం కలర్స్‌లో సేల్‌కి వస్తుంది. ప్రస్తుత, ఈ మొబైల్ చైనాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. త్వరలో ఇండియాలో విడుదలయ్యే అవకాశం ఉంది.