Last Updated:

iQOO 13: రేపటి కోసం.. ఐక్యూ 13 వచ్చేసింది.. మామూలుగా లేదు మాస్టారు..!

iQOO 13: రేపటి కోసం.. ఐక్యూ 13 వచ్చేసింది.. మామూలుగా లేదు మాస్టారు..!

iQOO 13: ఐక్యూ ఇటీవల iQOO 13 ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. మొబైల్ త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానుంది. కంపెనీ కూడా దీన్ని అధికారంగా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్‌కి వస్తుంది. ఇప్పుడు ఈ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి, దాని ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం కంపెనీ IQOO 13 ఇండియా లాంచ్ తేదీని వెల్లడించలేదు. ఈ రాబోయే ఫోన్ 6,150mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫోన్ 6.82 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 16GB RAM+ 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. దీనితో పాటు ఇది 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఐక్యూ13 చైనాలో 12GB RAM + 16GB RAMతో మొత్తం 5 వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 256GB , 1 TB వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ మొబైల్ ధర దాదాపు రూ.47,200 నుంచి రూ.61,400 ఉంది. భారతదేశంలో కూడా ఇదే ధరతో లాంచ్ కావచ్చు. 1TB స్టోరేజ్ వేరియంట్ విడుదల అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మొబైల్ 6.82-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది OLED డిస్ప్లే. ఇది 3168 X 1440 పిక్సెల్‌ల రిజల్యూషన్, గరిష్టంగా 1800 నిట్‌ల బ్రైట్నెస్,  144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్ సరికొత్త క్వాల్‌కమ్ స్నాప్‌‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 5 OSలో రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 16GB RAM + 1TB స్టోరేజ్ ఉన్నాయి.

ఈ మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో OISతో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, OISతో 50-మెగాపిక్సెల్ సోనీ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 32-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ 6,150mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది సిలికాన్ యానోడ్ టెక్నాలజీలో తయారైంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు.