Last Updated:

Apple iPhone 16 E: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ఈ రిలీజ్.. బడ్జెట్ ఫ్రెండ్లీ?

Apple iPhone 16 E: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16ఈ రిలీజ్.. బడ్జెట్ ఫ్రెండ్లీ?

Apple iPhone 16 E launched in India: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. యాపిల్ నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 16ఈ పేరుతో యాపిల్ సంస్థ భారత్‌లో విడుదల చేసింది. అయితే ఈ సరికొత్త ఫోన్‌ను విడుదల చేస్తూనే.. నిన్నటివరకు ప్రచారం చేసిన ఐఫోన్ ఎస్ఈ 4ను తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4 విడుదల చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ యాపిల్ సంస్థ కొత్త మోడల్ ఐ ఫోన్ 16 సిరీస్‌ను విస్తరించే పనిలో భాగంగా ఐఫోన్ 16ఈ రిలీజ్ చేసింది. యాపిల్ లవర్స్‌కు మరింత చేరువలో ఉండేలానే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లాంఛ్ చేసినట్లు యాపిల్ సంస్థ పేర్కొంది.

ఐఫోన్ 16ఈ ధర విషయానికొస్తే.. అమెరికాలో ఐఫోన్ 16 ఈ 128 జీబీ వేరియంట్ ప్రారంభ ధర 599 డాలర్లు ఉండగా.. భారత కరెన్నీలో రూ.49,500. అయితే ఈ వేరియంట్ ధర భారత్‌లో రూ.59,900గా ఉంది. గతంలో ఐఫోన్ 16 సిరీస్ ప్రారంభ ధర భారత్‌లో రూ.79,900గా ఉండేది. కాగా, ఐఫోన్ 16 ఈ మోడల్‌ను యాపిల్ సంస్థ బడ్జెట్ ఫ్రెండ్లీగా భారత్‌లో తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్ల విషయంలో దాదాపు 20వేల వరకు తేడా కనిపిస్తుంది. ఇక, రేపటి నుంచి ప్రీ ఆర్డర్లు మొదలు కానుండగా… 28 నుంచి డెలివరీ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఐఫోన్ 16 ఈ 256 వేరియంట్ ధర రూ.69,900 ఉండగా.. ఐఫోన్ 16ఈ 512 వేరియంట్ ధర 89,900గా ఉంది.