Redmi Note 13 Series Price Drop: పడిపోయిన ధరలు.. భారీగా తగ్గిన రెడ్‌మి నోట్ 13 సిరీస్ ప్రైస్.. ఇప్పుడు ఎంతంటే..?
Redmi Note 13 Series Price Drop: షియోమి భారతదేశంలో తన తాజా రెడ్‌మి నోట్ 14 సిరీస్ ప్రారంభించింది. దీని తర్వాత నోట్ 13 సిరీస్ ధరలు తగ్గుముఖం పట్టామయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ స్టాండర్డ్ నోట్ 13, ప్రో, ప్రో ప్లస్ వెర్షన్ ధరలు గణనీయంగా తగ్గించింది. రెడ్‌మి నోట్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,818. ఈ క్రమంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆఫర్ల విషయానికి వస్తే నోట్ 13 సిరీస్ ఆర్కిటిక్ వైట్ కలర్ మోడల్‌లో కనిపిస్తుంది. బ్లాక్ మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ.14,988. ఈ హ్యాండ్‌సెట్‌ను భారతదేశంలో రూ. 18,999కి లాంచ్ అయింది. అంటే ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.4,011 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది.
అదేవిధంగా 128GB స్టోరేజ్ మోడల్‌తో రెడ్‌మి నోట్ 13 ప్రో తగ్గింపు ధర రూ.18,000. 256GB మోడల్ ధర రూ.20,888. ప్రో వెర్షన్ భారతదేశంలో బేస్ కాన్ఫిగరేషన్ కోసం రూ. 25,999. అంటే కస్టమర్లు ఈ ఫోన్‌పై రూ.7,999 ఫ్లాట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు.
చివరగా రెడ్‌మి నోట్ 13 ప్రో+ బేస్ 256GB స్టోరేజ్ మోడల్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 22,632కి విక్రయిస్తోంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్ భారతదేశంలో రూ. 31,999కి ప్రారంభించారు. అంటే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ రూ. 9,367 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది.
ఈ ధరలన్నీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. మిడ్-రేంజ్ రెడ్‌మి ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవన్నీ కొన్ని గొప్ప డీల్‌లు. Xiaomi కొత్త రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ను రెడ్‌మి నోట్ 13 సిరీస్ మాదిరిగానే పరిచయం చేసింది.
రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్ 5G 8GB + 128GB వేరియంట్ ధర రూ. 29,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 31,999, 12GB + 512GB వేరియంట్ ధర ఆఫర్‌లతో సహా రూ. 34,999. అదే సమయంలో రెడ్‌మి నోట్ 14 ప్రో 5G 8GB + 128GB వేరియంట్ ధర రూ. 23,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 25,999, ఇందులో ఆఫర్లు కూడా ఉన్నాయి.
స్టాండర్డ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 14 5జీ మోడల్ 6GB + 128GB వేరియంట్‌కు రూ. 17,999, 8GB + 128GB వేరియంట్‌కు రూ. 18,999. ఆఫర్‌లతో సహా 8GB + 256GB వేరియంట్ ధర రూ. 20,999. డిసెంబర్ 13 నుండి కొత్త Redmi Note 14 5G సిరీస్ సేల్‌కి వస్తుంది.