Motorola Edge 70 Leaks: మోటో మాయ.. మోటరోలా ఎడ్జ్ 70 వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్..!

Motorola Edge 70 Leaks: మోటరోలా ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ నెక్స్ట్ సిరీస్ అంటే మోటరోలా ఎడ్జ్ 70 గురించి చర్చ ప్రారంభమైంది. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ రాబోయే మోటరోలా ఎడ్జ్ 70 ఫోటోను షేర్ చేసింది, ఇది వినియోగదారుల ఉత్సాహాన్ని పెంచింది. షేర్ చేసిన ఫోటోను చూస్తే, Motorola Edge 70 డిజైన్ మోటరోలా ఎడ్జ్ 60ని పోలి ఉండే అవకాశం ఉంది.
Motorola Edge 70 Display Features
లీక్‌ల ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ 70 డ్యూయల్ కర్వ్డ్ డిస్‌ప్లేతో రావచ్చు. ఈ pOLED డిస్‌ప్లే 6.7 అంగుళాలు ఉంటుంది. కంపెనీ ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫోన్ కెమెరా మాడ్యూల్ ఎడ్జ్ 60 మాదిరిగానే ఉంటుంది. అలాగే, మీరు దాని వెనుక ప్యానెల్‌లో వీగన్ ఫినిషింగ్‌ను చూడవచ్చు. మోటో ఎడ్జ్ 60 బ్లూ, గ్రీన్ షేడ్స్‌తో పాటు, కంపెనీ ఈ ఫోన్‌ను అనేక ఇతర రంగు ఎంపికలలో కూడా లాంచ్ చేయవచ్చు.
Motorola Edge 70 Camera Features
ఈ ఫోన్ ఫీచర్ల గురించి ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. లీక్స్ ప్రకారం.. కంపెనీ ఈ ఫోన్‌లో మోటో ఎడ్జ్ 60 లాగానే 50-మెగాపిక్సెల్ సోనీ లిటియా 700C కెమెరాను అందించబోతోంది. అలాగే, Razer 2025 లాగా, కంపెనీ ఫోన్‌లో 12GB ర్యామ్‌తో డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఫోన్ ధర దాదాపు 400 డాలర్లు (సుమారు 34 వేల రూపాయలు) ఉండచ్చు.
Motorola Edge 70 Launch Date
ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ షేర్ చేసిన రెండర్‌లో, ఫోన్ లాక్ స్క్రీన్‌పై సెప్టెంబర్ 23 తేదీ కనిపిస్తుంది. ఆసక్తికరంగా, ఫోన్ లాక్‌స్క్రీన్ సెప్టెంబర్ 23 ను గురువారంగా చూపిస్తుంది, అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 మంగళవారం. అయితే 2026 సంవత్సరంలో సెప్టెంబర్ 23 బుధవారం నాడు వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేము.
ఇవి కూడా చదవండి:
- Apple Launching New Device: యాపిల్ పెద్ద ప్లాన్.. 15 కొత్త డివైజ్‌లు లాంచ్ చేస్తుంది.. ఏమేమి ఉన్నాయో తెలుసా..?