Last Updated:

Best 5G Smartphones Under 10000: రూ.10 వేల బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడు ఏది కొనాలో తెలుసా..?

Best 5G Smartphones Under 10000: రూ.10 వేల బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఇప్పుడు ఏది కొనాలో తెలుసా..?

Best 5G Smartphones Under 10000: హాయ్ ఫ్రెండ్స్.. మీరు కూడా మీ పాత 3G లేదా 4G ఫోన్‌తో విసిగిపోయారా? ఇప్పుడు కొత్త 5G ఫోన్‌కి మారాలని నిర్ణయించుకున్నారా? అయితే మీ బడ్జెట్ రూ. 10,000 లేదా అంతకంటే తక్కువగా ఉంటే చింతించకండి. రూ.10,000 ధర పరిధిలో చాలా మంచి ఫీచర్లతో వస్తున్న ఇలాంటి స్మార్ట్‌ఫోన్‌లు ఈరోజు మార్కెట్లో బోలెడు ఉన్నాయి. ఈ మొబైల్స్‌లో పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా చూడబోతున్నారు. అటువంటి ఐదు ఉత్తమ స్మార్ట్‌ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Redmi A4 5G
స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌‌తో రూ. 10,000 కంటే తక్కువ ధరకే Redmi A4 5G ఉత్తమ ఎంపికగా కనిపిస్తోంది. ఈ ప్రాసెసర్ సహాయంతో ఈ ఫోన్ బడ్జెట్‌లో అద్భుతమైన పనితీరును ఇస్తుంది. మొబైల్‌లో 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే కనిపిస్తుంది, ఇది సున్నితమైన విజువల్స్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఫోన్‌లో 50MP కెమెరా, బలమైన 5160mAh బ్యాటరీ ఉంది, ఇది చాలా కాలం పాటు పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.8,940.

Poco M7 5G
రెడ్‌మీ తర్వాత మీరు ఈ ధర పరిధిలో Poco M7 5Gని కూడా తనిఖీ చేయచ్చు, దీనిలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ ఉంది ఇది కాకుండా మొబైల్‌లో 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే ఉంది. అలానే 50MP సోనీ IMX852 కెమెరా ఉంది, ఇది అద్భుతమైన ఫోటో నాణ్యతను అందిస్తుంది. అలానే 5160mAh పెద్ద బ్యాటరీ కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.9,999.

Samsung Galaxy F06 5G
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఈ ఫోన్‌లో అందించారు. 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే, 50MP కెమెరా ఈ ఫోన్‌ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అదేవిధంగా పెద్ద 5000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల OS అప్‌డేట్లు దీర్ఘకాలంలో దీనిని మంచి ఎంపికగా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.9,199. ఇది ప్రస్తుతం సామ్‌సంగ్ చౌకైన 5G ఫోన్.

Moto G35 5G
రూ. 10,000 కంటే తక్కువ ధరకు Moto G35 5G Unisoc T760 ప్రాసెసర్‌ని అందిస్తోంది, ఇది బడ్జెట్ విభాగంలో గొప్ప ఎంపిక. ఫోన్‌లో 6.72-అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా ఉంది, ఇది మంచి ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. ఇది కాకుండా పెద్ద 5000mAh బ్యాటరీ, స్టాక్ Android అనుభవాన్ని కలిగి ఉంది. దీని ధర ఇప్పుడు రూ.9,999

Redmi 14C 5G
స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌తో 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే ఉన్న ఈ Redmi ఫోన్‌ను రూ. 10,000 కంటే తక్కువ ధరకు కూడా కొనుగోలు చేయచ్చు. కెమెరా గురించి చెప్పాలంటే ఇందులో 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది. అంతే కాకుండా మొబైల్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ కూడి ఉంది, తద్వారా మీరు దీన్ని ఎక్కువసేపు ఉపయోగించవచ్చు. ప్రస్తుతం దీని ధర రూ.9,999.