iPhone 15 Price Crashed: ధరలు కుప్పకూలాయి.. రూ.25 వేలకే ఐఫోన్ 15.. ఫ్లిప్‌కార్ట్ ఎంటో ఇలా చేసింది..!

iPhone 15 Price Crashed: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలంటే, ముందుగా గుర్తుకు వచ్చేది ఐఫోన్. నేటికీ ఐఫోన్లు సాధారణ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా కాస్ట్‌లీ. అందుకే చాలా మంది వాటిని కొనడానికి డిస్కౌంట్ ఆఫర్ల కోసం చూస్తుంటారు. మీరు ఐఫోన్ కొనాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ సాసా లేలే సేల్ మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నుండి చాలా తక్కువ ధరకు ఐఫోన్ 15 ను కొనుగోలు చేయవచ్చు.
మీరు చౌకగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే SASA LELE SALE ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌ల ధరను భారీగా తగ్గించింది. మీరు ఐఫోన్లు చౌకగా మారుతాయని ఎదురు చూస్తుంటే, కొనడానికి ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు కస్టమర్లకు ఫ్లాట్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఐఫోన్ 15పై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
iPhone 15 Offers
ఐఫోన్ 15 కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ఫోన్ ధర ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,900గా ఉంది. సాసా లేలే సేల్‌లో, కంపెనీ దాని ధరను 8శాతం తగ్గించింది. ఈ డిస్కౌంట్ తర్వాత మీరు ఐఫోన్ 15 128GB వేరియంట్‌ను కేవలం రూ. 63,999 కి కొనుగోలు చేయచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే 5శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
iPhone 15 Discounts
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు తక్కువ ధరకు ఐఫోన్ కొనుగోలు చేయడానికి ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే, దానిని రూ.38 వేల కంటే ఎక్కువకు ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. మీరు పూర్తి ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందగలిగితే, మీరు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రూ. 25,000కు కొనుగోలు చేయచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.
iPhone 15 Specifications
ఐఫోన్ 15 అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌తో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు IP68 రేటింగ్ కూడా అందించారు. ఇది నీటిలో కూడా పూర్తిగా సురక్షితం. 200 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో సూపర్ రెటినా డిస్‌ప్లేను ఉంది. అసలు విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్‌ఫోన్ iOS 17 పై రన్ అవుతుంది. మీరు దీన్ని అప్‌గ్రేడ్ చేయచ్చు. ఇది యాపిల్ A16 బయోనిక్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 6జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం, వెనుక భాగంలో 48+12 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా ఉంది. సెల్ఫీ. వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలానే పవర్ కోసం 3349mAh బ్యాటరీ అందించారు.
ఇవి కూడా చదవండి:
- Sony Big Comeback: బిక్ కమ్ బ్యాక్.. సోనీ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్.. మునుపెన్నడూ చూడని స్టన్నింగ్ ఫీచర్స్..!