Published On:

Samsung Galaxy S24 Plus Price Cut: ఫ్లాష్ ఫ్లాష్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ. 50 వేల డిస్కౌంట్.. ఫిదా చేస్తున్న ఆఫర్స్..!

Samsung Galaxy S24 Plus Price Cut: ఫ్లాష్ ఫ్లాష్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ. 50 వేల డిస్కౌంట్.. ఫిదా చేస్తున్న ఆఫర్స్..!

Samsung Galaxy S24 Plus Price Cut: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతర మొదలుపెట్టింది. కంపెనీ సాసా లేలే సేల్‌లో ఫ్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. ఇప్పడు ఎటువంటి టెన్షన్ లేకుండా ‘Samsung Galaxy S24 Plus’ని కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు లక్ష రూపాయలు. కాబట్టి చాలా మంది వినియోగదారులు దీనిని కొనలేరు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ దాని ధరలో పెద్ద కోత విధించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు గొప్ప కెమెరా సెటప్‌ను చూస్తారు. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

Samsung Galaxy S24 Plus Offers
సామ్‌సంగ్ ఈ ప్రీమియం ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష రూపాయలకు అంటే రూ.99,999గా ఉంది. సాసా లేలే సేల్ ఆఫర్‌లో ఈ ఫోన్‌పై 47శాతంం భారీ తగ్గింపును ఇస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో మీరు ఫోన్‌ను కేవలం రూ. 52,999కే కొనుగోలు చేయచ్చు. అంటే నేరుగా రూ. 47,000 ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది, అయితే ఈ డిస్కౌంట్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించాలి.

 

Samsung Galaxy S24 Plus Exchange Offers
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లచ్చు. అయితే దీని కోసం మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలి. సాసా లేలే సేల్‌లో రూ.49,550 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 20,000 ఆదా చేస్తే, ఈ ప్రీమియం ఫోన్ చాలా చౌక ధరకు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

 

Samsung Galaxy S24 Plus Specifications
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ అల్యూమినియం ఫ్రేమ్‌, గ్లాస్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌‌తో విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో IP68 రేటింగ్‌ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌‌కి సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 పై రన్ అవుతుంది, దీనిని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. పనితీరును పెంచడానికి, దీనికి స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ఇచ్చారు. 12జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. 50+12+10 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా ఉంది.