Home / latest national news
శవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 యొక్క 21 కేసులు నమోదయ్యాయి. గోవా, కేరళ మరియు మహారాష్ట్రలో కొత్త కరోనావైరస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.గోవాలో ఇప్పటివరకు 19 కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదయ్యాయి. కేరళ మరియు మహారాష్ట్రలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.
పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.
దక్షిణ తమిళనాడు జిల్లాల్లో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా తెలిపారు.తిరునెల్వేలి, టుటికోరిన్ జిల్లాల్లో వర్షాల కారణంగా గోడ కూలి కొందరు, విద్యుదాఘాతంతో మరి కొందరు మరణించారని ఆయన తెలిపారు.
ఇండియన్ నేషనల్ డవలప్మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ కూటమి నాలుగవ సమావేశం న్యూఢిల్లీలోని అశోక హోటళ్లో మంగళవారం మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, టీఎంసీ చీప్ మమతా బెనర్జీ, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, తదితరులు పాల్గొన్నారు.
ఐపీఎల్ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానంలో నిలిచాడు.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్‌లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
అలహాబాద్ హైకోర్టు మంగళవారం జ్ఞాన్వాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావాను సవాల్ చేస్తూ దాఖలైన మొత్తం ఐదు వ్యాజ్యాలను అలహాబాద్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
స్పీకర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్నారంటూ లోక్‌సభ నుంచి మరో 49 మంది ఎంపీలను మంగళవారం సస్పెండ్ చేసారు.సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన శశిథరూర్, మనీష్ తివారీ, కార్తీ చిదంబరం, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన డింపుల్ యాదవ్, ఎన్సీపీకి చెందిన ఫరూక్ అబ్దుల్లా, డీఎంకేకు చెందిన ఎస్ సెంథిల్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకు, సుదీప్ బంధోపాధ్యాయ ఉన్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు,(కేటీఆర్) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మధ్య మంగళవారం ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం. అంతమాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవంటూ సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
లోక్‌సభలో గతవారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 92మందిపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌధరి సహా 47మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.