Home / latest national news
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను 15 మంది విపక్ష ఎంపీలను మిగిలిన సెషన్‌కు సస్పెండ్ చేస్తూ లోక్‌సభ ఈరోజు తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన 15 మందిలో తొమ్మిదిమంది ఎంపీలు కాంగ్రెస్‌కు చెందిన వారు. వీరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు.
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల తర్వాత మతపరమైన మరియు బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సాధారణ మరియు నియంత్రిత లౌడ్ స్పీకర్ల వాడకంపై ఎటువంటి నియంత్రణ లేదని తెలిపారు.
గత కొద్ది కాలంగా వినియోగదారులకు చుక్కలు చూపించిన ఉల్లి, టమాటాల స్దానంలో తాజాగా వెల్లుల్లి చేరింది. దేశంలోని పలు ప్రాంతాల్లో వెల్లుల్లి ధర సుమారుగా రూ.400 కు చేరుకుంది. ఉల్లిపాయల సరఫరాలో కొరత ఏర్పడిన తరువాత దాని స్దానంలో వెల్లుల్లి వినియోగం పెరగడంతో దీని ధర అనూహ్యంగా పెరుగుతోంది.
బుధవారం లోక్‌సభలో కలర్ స్మోక్ ప్రయోగించి పోలీసుల చేతికి చిక్కిన నిందితులను సాగర్ శర్మ , మనోరంజన్ గా గుర్తించారు. వీరిలో సాగర్ శర్మ తీసుకున్న విజిటర్ పాస్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా పేరుమీద జారీ అయినట్లు తెలుస్తోంది. మైసూరుకు చెందిన మనోరంజన్ వృత్తిరీత్యా ఇంజనీర్ .
లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న వేళభద్రతా వైఫల్యం బయటపడింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూసుకొచ్చిన ఇద్దరు ఆగంతకులు టియర్ గ్యాస్ లీక్ చేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సంఘటనతో ఎంపీలు భయంతో పరుగులు తీశారు.
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు దుబాయ్ అధికారులతో భారత్ అధికారులు టచ్‌లో ఉన్నారని ఈడీ తెలిపింది.
ఎయిర్ ఇండియా మంగళవారం క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం యూనిఫామ్‌లను ఆవిష్కరించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా వీటిని రూపొందించారు.ఎయిర్‌లైన్‌లోని మహిళా క్యాబిన్ సిబ్బంది ఆధునిక టచ్‌తో కూడిన ఓంబ్రే చీరలను ధరిస్తారు, పురుషులు బంద్గాలాలు ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది కోసం క్లాసిక్ బ్లాక్ సూట్లను డిజైన్ చేశారు.
లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఆమెను తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని కోరే ప్రక్రియను ప్రారంభించాలని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
బీజేపీ అధిష్టానం రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మని అధికారికంగా ప్రకటించింది. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరు తెరమీదకు వచ్చింది. బీదియా కుమారి మరియు ప్రేమ్‌చంద్ బైర్వా లను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు.